అజిత్
తాజా చిత్రం ‘డేవిడ్ బిల్లా’ త్వరలో తెలుగులోకి విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ
చిత్రం కథని దర్శకుడు చక్రి
తోలేటి వివరిస్తూ..ఓ కుర్రాడు అనాథగా
రోడ్డుపైకి వచ్చాడు. ఆకలితో అలమటించాడు. ఎవరూ ఆదరించలేదు. అంతే
ఎదురు తిరిగాడు, దోచుకొన్నాడు. అప్పుడు తీరింది ఆకలి. ఆ బాటలోనే
వెళ్తూ నియంతలా ఎదిగాడు. ప్రపంచాన్నే శాసించాడు. ఆ ప్రయాణంలో ఏం
సాధించాడు? ఏం కోల్పోయాడో 'డేవిడ్
బిల్లా'లో చూడండి అన్నారు.
పార్వతీ ఓమనకుట్టన్, బ్రూనా అబ్దుల్లా హీరోయిన్స్ చేస్తున్న ఈ చిత్రం వచ్చే
నెల 8న చిత్రాన్ని ప్రేక్షకుల
ముందుకు తీసుకొస్తారు.
అజిత్‌ని స్టయిలిష్‌గా
ఆవిష్కరించిన చిత్రం ‘బిల్లా’ చిత్రానికి ప్రీక్వెల్ గా రూపొందిన ఈ
చిత్రం కథ ఎలా ఉండబోతోందనేది
అంతటా హాట్ టాపిక్ గా
మారింది. అందులోనూ ఈ చిత్రం సీక్వెల్
కాకుండా బిల్లాకు ప్రీక్వెల్ కావటంతో మరింత ఆసక్తి పెరిగింది.
ఇక ఈ చిత్రం కథ...బిల్లా మాఫియా లీడర్ అవ్వకముందు ఏం
చేసేవాడు? అతను మాఫియాలోకి ఎంటరవ్వడానికి
కారణం ఏంటి? అసలు బిల్లాగా
అతను ఎలా రూపొందాడు. అంత
పరవ్ శక్తిగా ఎలా మారి ప్రపంచానికి
సవాళ్లు విసిరాడు...వంటి అనేక విషయాలు
ఈ చిత్రంలో చర్చకు రానున్నాయి. ఇవన్నీ ఫ్లాష్‌బ్యాక్ లో రానుందని తెలుస్తోంది.
తెలుగులో
ఈ చిత్రం ప్రదర్శన హక్కులు పొందిన శోభ మాట్లాడుతూ ''ప్రభాస్
నటించిన 'బిల్లా' చిత్రానికి ముందు భాగం ఈ
చిత్రం. ఇందులో డేవిడ్ ఎవరు? అనేది కీలకం.
అజిత్ నటన ఆకట్టుకొంటుంది. .అజిత్
కెరియర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం
ఇది. ఈ చిత్రంలో అజిత్
రిస్కీ ఫైట్లు చేశారు. ఈ ఫైట్స్ ప్రేక్షకులను
థ్రిల్‌కి గురి చేసే
విధంగా ఉంటాయి. ‘బిల్లా’లో అజిత్ స్టయిలిష్‌గా కనిపించారు. ఈ
చిత్రంలో ఆయన మరింత స్టయిలిష్‌గా కనిపిస్తారు. ఈ
చిత్రం కోసం ఉక్రెయిన్‌లో
కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు''
అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:
ఆర్.డి.రాజశేఖర్,
సంగీతం:
యువన్‌శంకర్ రాజా.
అజిత్
నటించిన 'గ్యాంబ్లర్' చిత్రం ఇటీవల తెలుగులో అనువాదమైనా
పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినా ఈ చిత్రానికి
మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇక ఆ మధ్య
కమలహాసన్, వెంకటేష్‌లు నటించిన 'ఈనాడు'
చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రి తోలేటి ఈ
తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ సరసన పార్వతి ఓమనకుట్టన్,
బ్రునా అబ్దుల్లా నాయికలుగా నటిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని
సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్
పార్ట్ పూర్తయింది. వేసవి సందర్భంగా త్వరలో
సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు.
0 comments:
Post a Comment