యంగ్
టైగర్ జూనియర్ ఎన్టీఆర్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్
శంకర్ కాంబినేషన్లో ‘ఎంఎల్ఏ' అనే చిత్రం రూపొందబోతున్నట్లు
ఆమధ్య వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. 'Manchi Lakshanalunna Abbayi" అని మీనింగ్ వస్తుందని
ఆ మధ్య ప్రచారం జరిగింది.
అయితే
తాజాగా ఈ విషయంపై దర్శకుడు
హరీష్ శంకర్ మాట్లాడుతూ...ఆ
చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు
చేయలేదని స్పష్టం చేశారు. పూర్తిగా డిఫరెంట్ స్క్రిప్టుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని,
అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈచిత్రంలో
ఉంటాయని హరీష్ స్పష్టం చేశారు.
శ్రీ
వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని
నిర్మిస్తారని హరీష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం
జూ నియర్ ఎన్టీఆర్ శ్రీను
వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా' చిత్రంలో
నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో
జూనియర్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. దూకుడు సినిమాను
మించిన ఎంటర్ టైన్మెంట్స్ మసాలాతో
శ్రీను వైట్ల ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు.
0 comments:
Post a Comment