సన్నగా,
నాజూకుగా, బలంగా, ఆరోగ్యంగా వుండాలంటే అందరికి ఇష్టమే. బరువున్నవారు ఈ ప్రణాళికలో భాగంగా
కొద్దిపాటి కిలోలు బరువు తగ్గాలని కూడా
నిర్ణయించుకొని వుంటారు. బరువు తగ్గే మీ
ప్రణాళికల ఆచరణకు తేలికైన చిట్కాలు పరిశీలించండి.
బరువు
తగ్గే చిట్కా 1 - ఎప్పుడూ ఒకే రీతిగా.....ఏ
రకం వ్యాయామం చేసినప్పటికి దానిని మానకుండా కొనసాగిస్తూండండి. దీనికిగాను మీకు స్ధిర నిర్ణయం,
మీ వద్ద వున్న వారి
సహకారం మీకు కావాలి. వెయిట్
లాస్ కొరకు మీరు చేసే
వ్యాయామాలు దీర్ఘకాలంలో తప్పక ఫలితాలనిస్తాయి. కొద్ది
వారాలకో లేదా నెలలకో వ్యాయామాలు
మార్చండి. విశ్రాంతి రోజులలో తప్ప వ్యాయామ తరగతులు
మిస్ చేయకండి.
బరువు
తగ్గే చిట్కా 2 - సమయానికి తినండి...వెయిట్ లాస్ కొరకు ఏం
తినాలనేది మీకు తెలిసే వుంటుంది.
ఆ ఆహారాలను అవి మూడు సార్లయినా
లేదా ఆరు సార్లయినా తింటూనే
వుండండి. మానకండి. తిండి మానేయటం, సమయానికి
తినకపోవటం ఎసిడిటీ వంటి సమస్యలు తెచ్చిపెడతాయి.
అలాగే శరీరానికి నీరు బాగా అందించండి.
బరువుతగ్గే
చిట్కా 3 - చురుకుగా వుండండి - చురుకుగా వుండండి. అవకాశమున్నపుడల్లా, ఉద్యోగం కూర్చునేదయినప్పటికి లేచి కదులుతూ వుండండి.
లేచి చిన్న నడక నడవండి.
వీలైతే ప్రతి రెండు గంటలకు
తాజా గాలి పొందండి. కొవ్వు
పేరుకోకుండా వుంటుంది. కిరాణా స్టోర్స్ లేదా బస్ స్టాప్
మొదలగువాటికి నడవండి.
బరువుతగ్గే
చిట్కా 4 - బాగా నిద్రించండి. శరీరానికి
విశ్రాంతి చాలా అవసరం. ప్రతి
రాత్రి 7 నుండి 8 గంటలనిద్ర కావాలి. తక్కువ లేదా ఎక్కువ నిద్రలు
కొవ్వు ఏర్పరుస్తాయి. కనుక చాలినంత విశ్రాంతి
తీసుకోండి.
బరువుతగ్గే
చిట్కా 5 - సరైన రీతిలో శ్వాస
తీసుకోండి. యోగా నిపుణుల మేరకు
గాలి పీల్చితే లేదా వదిలితే మీ
శరీరంలోని డయాఫ్రం సంకోచ వ్యాకోచాలు చేయాలి.
ఇది మీకుగల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
బరువుతగ్గే
చిట్కా 6 - సంయమనం పాటించండి. బరువు తగ్గాలంటే రాత్రికి
రాత్రే అయ్యే పనికాదు. కొంత
కాలం పడుతుంది. కనుక తక్షణ ఫలితాలకై
మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టి ఒకే రోజు అలసిపోయేలా
చేయకండి. వ్యాయామాలలో అపుడపుడు బ్రేక్ ఇచ్చినప్పటికి అది మీ శరీరానికి
మంచిదే. అపుడపుడూ ఒక చాక్లెట్ లేదా
పిజ్జా వంటివి తిన్నా మీ ఆహార ప్రణాళికకు
అడ్డంకి కాదు.
మీ శరీరాన్ని అవగాహన చేసుకొని దాని కోరికలు గౌరవిస్తే
అదే మీకు వెయట్ లాస్
అందిస్తుంది. డైటింగ్ పేరుతో అవసరమైన ఆహారాలు వదులుకోవడం, గంటల తరబడి వ్యాయామాలు
చేసి శరీర సౌష్టవం మరింత
దిగజారేలా చేసుకోకండి. పై చిట్కాలు పాటించి
ఆరోగ్యంతో మంచి శారీరక సౌష్టవంతో
ఆనందించండి.
0 comments:
Post a Comment