హైదరాబాద్:
రాష్ట్రంలో ఇటీవల సంచలనం రేపిన
మద్యం సిండికేట్ల వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) సోమవారం
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి మధ్యంతర నివేదికను సమర్పించింది. ఎసిబి ఓ సీల్డు
కవరులో మధ్యంతర నివేదికను కోర్టుకు అందించింది. కాగా ఎసిబి జాయింట్
డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బదలీని సవాల్ చేస్తూ తెలుగుదేశం
పార్టీ వేసిన పిటిషన్పై
విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
విజయనగరం
జిల్లాలో ఎసిబి జెడిగా ఉన్న
శ్రీనివాస్ రెడ్డి మద్యం సిండికేట్పై
ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఆయన
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్
చేసుకున్నారని భావించడంతో కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వం ఆయనను ప్రమోషన్ పై
అక్కడి నుండి పంపించి వేసింది.
దీనిపై టిడిపి నేత శోభా హైమావతి
హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణను కోర్టు వాయిదా వేసింది.
కాగా
ఇటీవల రాష్ట్రంలో మద్యం సిండికేట్లపై దాడులు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.
కరీంనగర్, ఖమ్మం, విజయనగరం తదితర జిల్లాలో ఎసిబి
సిండికేట్లలో రాజకీయ నేతల పాత్ర ఉన్నట్లు
వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం
సిండికేట్లలో సంబంధింత శాఖ మంత్రి మోపిదేవి
వెంకట రమణ, మరో మంత్రి
బొత్స సత్యనారాయణ పేరు కూడా వినిపించింది.
ఖమ్మం
జిల్లాలో మద్యం సిండికేట్ నున్నా
రమణ వాంగ్మూలం కూడా రాజకీయవర్గాల్లో ఆందోళన
కలిగించింది. ఆయన ఆ పార్టీ
ఈ పార్టీ అని తేడా లేకుండా
అన్ని పార్టీల నేతల పేర్లు బయట
పెట్టారని వార్తలు వచ్చాయి. ప్రధానంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత సిండికేట్ల నుండి
25 లక్షలు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆమె
తీవ్రంగా ఖండించారు.
విజయనగరం
జిల్లాలో అప్పటి ఎసిబి జెడి శ్రీనివాస్
రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దాడులు ముఖ్యమంత్రి కిరణ్, బొత్స మధ్య తీవ్ర
విభేదాలకు దారి తీసింది. వీరి
గొడవ ఢిల్లీకి కూడా చేరుకుంది. ఆ
తర్వాత కిరణ్ ప్రభుత్వం శ్రీనివాస్
రెడ్డిని ప్రమోషన్ పై అక్కడి నుండి
పంపించడంతో ఇద్దరి మధ్య విభేదాలు అప్పటికి
చల్లారాయి.
0 comments:
Post a Comment