Monday, April 23, 2012

Balakrishna New Film Details


బాలకృష్ణ వరసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. తాజాగా ఆయన శ్రీవాస్‌ (లక్ష్యం ఫేమ్‌) దర్శకత్వంలో చిత్రం చేయడానికి గ్రీన్సిగ్నల్ఇచ్చారని సమాచారం. కొత్త చిత్రం వారంలోనే మొదల కానుందని తెలుస్తోంది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం ఉంటుందని చెప్తున్నారు. చిత్రం స్క్రిప్టుపై శ్రీవాస్ చాలా కాలంగా కసరత్తులు చేసారని,విన్న వెంటనే బాలకృష్ణ ఓకే చేసాడని చెప్పుకుంటున్నారు. ఇక చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. మేరకు త్వరలోనే ప్రకటన రానుంది. ప్రస్తుతం బాలకృష్ణ అధినాయకుడు డబ్బింగ్ లో ఉన్నారు.

చిత్రమే కాకుండా మరికొన్నింటిని బాలకృష్ణ అంగీకారం తెలపాల్సి ఉంది. అలాగే రవి చావలి దర్శకత్వంలో రూపొందే శ్రీమన్నారాయణ చిత్రం కూడా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఎల్లో ఫ్లవర్స్సంస్థలో సినిమా చేస్తున్నారు. చిత్రంలో బాలకృష్ణ...జర్నిలిస్ట్ గా విభిన్నమైన పాత్రలో కనపిస్తారు. మరో ప్రక్క మోహన్ బాబు నిర్మాణ సంస్ధలో రూపొందుతున్న ' కొడతారా ఉలిక్కి పడతారా'లో ప్రత్యేక పాత్రని చేస్తున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందే చిత్రంలో మంచు మనోజ్ హీరోగా చేస్తున్నారు. బాలకృష్ణ పాత్ర స్పూర్తితో మంచు మనోజ్ పాత్ర చేసే విన్యాసాలు అదరకొడతాయంటున్నారు. మంచు లక్ష్మి ప్రసన్న భారీ ఖర్చుతో చిత్రాన్ని నిర్మిస్తోంది. కృష్ణ వంశీ శిష్యుడు రాజా చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.

'సింహా'తో సక్సెస్కొట్టి ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ తర్వాత బాపు దర్శకత్వంలో చేసిన 'శ్రీరామరాజ్యం' ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దీనికి పూర్తిగా భిన్నంగా మరోవైపు అధినాయకుడు పూర్తిచేశారు. ఇందులో ఆయన మూడు పాత్రలు చేయడం విశేషం. బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి తెరకెక్కించిన చిత్రం 'అధినాయకుడు'. చిత్రం సెన్సార్ ఫార్మాలటీస్ పూర్తి చేసుకుని సర్టిపికేట్ పొందింది. చిత్రానికి సెన్సార్ టాక్ బాగా పాజిటివ్ గా వచ్చినట్లు సమాచారం. సినిమా ప్రారంభమైన నాటి నుంచి నెగిటివ్ టాక్ ను మూట గట్టుకున్న చిత్రం చాలా కాలంగా ఎప్పుడు రిలీజా అని అందరినీ ఊరిస్తోంది. శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక చిత్రం తర్వాత ఔట్అండ్ఔట్కమర్షియల్మూవీగాఅధినాయకుడురాబోతోంది.

దర్శకుడు పరుచూరి మురళి చిత్రం గురించి మాట్లాడుతూ ..“ ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు.గతంలో చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన బాలయ్య అధినాయకుడులో మరోసారి క్యారెక్టర్ చేస్తున్నారు.

తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్రాజ్, ఎమ్మెస్నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.

0 comments:

Post a Comment

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget