హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కాంగ్రెసు పార్టీ
ఎదురుదాడిలో దూకుడు పెంచినట్లుగా కనిపిస్తోంది. త్వరలో రాష్ట్రంలోని పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలో
ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాంగ్రెసు
ఇప్పటికే ఇటీవల జరిగిన ఉప
ఎన్నికల్లో చావుదెబ్బతిన్నది. అదే సమయంలో రానున్న
ఉప ఎన్నికలు 2014కు ప్రీ ఫైనల్
వంటివి. దీంతో కాంగ్రెసు ఎలాగైనా
కొన్ని స్థానాలలోనైనా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని
చూస్తోంది.
ఈ నేపథ్యంలో జగన్ తమ పైన
చేస్తున్న విమర్శలకు అంతే ధీటుగా స్పందించాలని
కాంగ్రెసు పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో
ఆయనపై ఎదురుదాడిలోనూ దూకుడు పెంచుతున్నారని అంటున్నారు. జగన్ తన అక్రమాస్తుల
కేసు విషయంలో సిబిఐ దర్యాఫ్తు తీరును
తప్పు పడుతున్నారు. వివాదాస్పద 26 జివోల వల్లనే జగన్
భారీగా ఆస్తులు కూడబెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటిపై జగన్ మంత్రివర్గ ఆమోదం
లేకుండా తన తండ్రి, దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
జివోలు జారీ చేయలేరని చెబుతున్నారు.
ఆయన వ్యాఖ్యలపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణ తదితరులు ఘాటుగానే స్పందించారు. జివోలలో తప్పుంటే తాము బాధ్యత వహిస్తామని,
కానీ తెరవెనుక జరిగే లాలూచీకు తమకు
సంబంధం లేదని చెబుతున్నారు. అయితే
జగన్ కూడా అదే స్థాయిలో
వారిని విచారించక పోవడాన్ని తప్పు పడుతున్నారు. దీంతో
కాంగ్రెసు తన వ్యూహం మార్చుకున్నట్లుగా
కనిపిస్తోంది.
గురువారం
న్యూఢిల్లీలో బొత్స సత్యనారాయణ ఆస్తుల
కేసు విషయంపై మాట్లాడుతూ.. తెర వెనుక జరిగే
లాలూచీలకు తాము బాధ్యత వహించమని,
జివోలలో తప్పుంటే తాము బాధ్యత వహిస్తామని
చెబుతూనే.. వైయస్ తప్పులు చేశాడని
ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన తప్పులు చేయలేదని
నిరూపించాల్సిన బాధ్యత కొడుకుగా జగన్కు ఉందని
కొత్త కోణంలో కౌంటర్ వేశారు. ప్రస్తుత హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి
కూడా ఎమ్మార్ కేసులో రాజగోపాల్ను రెండు పదవులలో
కొనసాగించిన అంశంపై వైయస్ను బాధ్యులు
చేశారు.
రాజగోపాల్కు రెండు పదవులపై
తాను పలుమార్లు వైయస్ దృష్టికి తీసుకు
వెళ్లానని, అయితే ఆయన రాజగోపాల్
స్థానంలో మరో సమర్థుడైన అధికారి
లేకపోవడంతోనే కొనసాగిస్తున్నట్లు తనతో చెప్పారని ఎమ్మార్
కేసులో వాంగ్మూలం ఇచ్చారు. గనుల లీజు మంజూరు
కోసం అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిపై
వైయస్ ఒత్తిడి తెచ్చారనే విషయం తనకు తెలియదని
చెప్పారు.
0 comments:
Post a Comment