హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక, సాక్షి న్యూస్ ఛానెల్కు ప్రకటనలు ఆపేయాలని
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సమాచరం మేరకు.. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
డిపార్టుమెంట్ ఆదివారం సాయంత్రం ఇందుకు సంబంధించిన ఓ జివోను ప్రిపేర్
చేసినట్లుగా తెలుస్తోంది. న్యాయవాదుల సలహాలు, సూచనల మేరకు ఈ
జివోను తయారు చేసినట్లుగా తెలుస్తోంది.
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
హయాంలో అక్రమంగా కోట్లాది రూపాయలు జగన్ సంపాదించారనే ఆరోపణల
నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)
ఆయన ఆస్తులపై విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ
కోర్టులో ఛార్జీషీట్ కూడా దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో సాక్షి పత్రిక, సాక్షి ఛానల్కు ప్రకటనలు
ఇవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం న్యాయవాదుల సలహాలు తీసుకొని జివోను రూపొందించిందని తెలుస్తోంది.
ఈ జివో రెండు రోజులలో
విడుదల కావొచ్చునని అంటున్నారు. జగన్కు చెందిన
జగతి పబ్లికేషన్స్లోకి అక్రమంగా పెట్టుబడులు
వచ్చాయనే దిశలో విచారణ జరుగుతున్న
దృష్ట్యా ఆ పత్రిక, టివి
ఛానెల్కు ప్రభుత్వ ప్రకటనలు
ఇచ్చి మద్దతు ఇవ్వడం అనైతికమవుతుందని, అందుకే ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల్లోగా ఈ
జివో ఎప్పుడైనా విడుదల కావొచ్చునని అంటున్నారు.
మరోవైపు
ఉప ఎన్నికలకు ముందు సిబిఐ జగన్కు చెందిన జగతి
పబ్లికేషన్స్పై చర్యలు తీసుకునే
అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో త్వరలో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి
ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ
నేపథ్యంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్
విడుదలకు ముందే జగతిపై తదుపరి
చర్యలు తీసుకోవాలని సిబిఐ భావిస్తోందని అంటున్నారు.
0 comments:
Post a Comment