విజయవాడ:
మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణను తమ్ముడిగా గుండెల్లో పెట్టుకుంటానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు.
వంగవీటి రాధాకృష్ణ శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. తమ్ముడిగా రాధాను పార్టీలో చేర్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాముడు
లక్ష్మణుడిని ఏ విధంగా చూశారో
ఆ విధంగా రాధాను తన గుండెల్లో పెట్టుకుంటానని
ఆయన చెప్పారు
వంగవీటి
మెహనరంగా, వైయస్ రాజశేఖర రెడ్డి
మధ్య ఉన్న స్నేహమే ఈ
రోజు తమ ఇద్దరినీ కలిపిందని
ఆయన అన్నారు. వారి స్నేహం తమతో
పునరావృతం అయిందని ఆయన అన్నారు. బందరు
పోర్టు కోసం నిర్వహించే ఆందోళనా
కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అగ్రభాగాన ఉంటుందని ఆయన చెప్పారు. ఒక
వేళ ఈ ప్రభుత్వం బందరు
పోర్టుకు అనుమతి ఇవ్వకపోతే తాము అధికారంలోకి రాగానే
రెండేళ్లలో పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
నాన్న
పేదవాడికి గజం స్థలం వంద
రూపాయలకే ఇచ్చారని, ఆ స్థలం ఇప్పుడు
45 వేల రూపాయలు అయిందని, రాబోయే సువర్ణ యుగంలో గజం స్థలం 50 రూపాయలకే
ప్రతి పేదవానికి ఇస్తామని ఆయన చెప్పారు. ఈ
ఆప్యాయతలకు ఎన్ని జన్మలు ఎత్తినా
రుణం తీర్చుకోలేనని ఆయన అన్నారు.
తాను
రాజకీయాల్లో ఉన్నంత కాలం దివంగత వంగవీటి
రంగా అభిమానులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితోనే
ఉంటారని వంగవీటి రాధాకృష్ణ చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి
కుటుంబాన్ని జనం మరిచిపోదని ఆయన
అన్నారు. వైయస్సార్ ఈ రాష్ట్రంలో ఎంతో
మందిని ఆదుకున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుత
కాంగ్రెసు ప్రభుత్వం వైయస్సార్ పథకాలు ఒక్కటొక్కటే మాయమవుతున్నాయని ఆయన అన్నారు. తమ
కుటుంబాన్ని నాయకులు మోసం చేశారు గానీ
జనం ఎప్పుడూ తమని అంటి పెట్టుకుని
ఉన్నారని ఆయన అన్నారు. తన
అనుచరులతో వంగవీటి రాధాకృష్ణ జగన్ సమక్షంలో వైయస్సార్
కాంగ్రెసు పార్టీలో చేరారు.
0 comments:
Post a Comment