జిమ్
కి వెళ్ళి వ్యాయామాలు చేసి బోర్ కొట్టేస్తే,
ఆసక్తికరంగా వ్యాయామాలు చేయండి. బీచ్, పార్క్ వంటి
బహిరంగ ప్రదేశాలలో, ప్రత్యేకించి ఈ వేసవిలో రన్నింగ్,
జాగింగ్ చేస్తూ వుంటే ఎంతో బాగుంటుంది.
తాజాగాలి,ఆహ్లాద వాతావరణం మీకు మరింత సేపు
చేయాలనిపిస్తుంది. అయితే, ఈ ప్రదేశాలలో చేసే
వ్యాయామాలు వీలైనంతవరకు ఉదయం వేళ లేదా
సాయంకాలాలు మాత్రమే చేయాలి.
సన్నని
శరీరానికి బీచ్ లేదా పార్క్
వ్యాయామాలు -
1. నీటిపై
పరుగెత్తండి - జిమ్ లో ట్రెడ్
మిల్ పై ఎలా పరుగుపెడతారో....అదే రకంగా, బీచ్
అయితే నీటిలో, పార్క్ అయితే, జాగింగ్ ట్రాక్ పై పరుగెత్తండి. ఎంతో
ఎనర్జీ ఖర్చవుతుంది. నీరు కాలి మణికట్టు
వరకు వచ్చి మీరు పరిగెట్టేటపుడు
చిందుతుంటే హాయిగా వుంటుంది.
2. కొంత
వ్యాయామం తర్వాత శరీరం వేడెక్కిన తర్వాత
పరుగు పెట్టండి. బీచ్ వంటి ఇసుక
వున్న ప్రదేశాలలో పరుగు కష్టమే. మీరు
అధిక శ్రమ పెట్టాల్సివస్తుంది. అయినప్పటికి మెత్తటి
ఇసుక కనుక పరుగుపెట్టవచ్చు. పరుగు
కాలికి షూస్ లేకుండా కూడా
చేయండి. గుండె వ్యాయామంగా బాగుంటుంది.
3. కొంతసేపు
పరుగుపెట్టిన తర్వాత, ఒక మంచి స్కిప్పింగ్
రోప్ తో కొద్ది సమయం
స్కిప్పింగ్ చేయండి. బాహ్య ప్రదేశాలలో స్కిప్పింగ్
చేయటం తేలిక. స్కిప్పింగ్ లో వున్న కష్టం
కూడా మీకు తెలియకుండా చేసేస్తారు.
ఈ వ్యాయామం కూడా గుండెకు మంచిది.
4. ఇంతవరకు
మీరు చేసిన గుండె సంబంధిత
వ్యాయామం మాత్రమే చాలదు. మంచి ఆకారం కల
శరీరం కావాలనుకుంటే కండరాలు శ్రమించే వ్యాయామాలు అంటే కొన్ని అరబిక్
వ్యాయామాలు కూడా చేయండి. నిలబడి
చేతులు ముందుకు, పక్కకు చాపటం, నడుము కిందకు, పక్కలకు
వంచటం, కాళ్ళు రెండూ దూరంగా పెట్టి
నడుము వంచి పక్కలకు కదలటం
వంటివి చేయాలి. ఏది చేసినా 8 నుండి
10 సార్లు చేయండి.
5. సిట్
అప్ లు లేదా గుంజీలు
- మీ చిన్నారి పొట్ట చదునుగా వుండాలంటే,
కొన్ని గుంజీలు తీయండి లేదా పొట్ట వంచే
వ్యాయామాలు చేయండి. వెల్లకిలా పడుకోండి చేతులు మీ ఛాతాభాగంపై పెట్టండి.
మీ శరీర పైభాగాన్ని పైకి
లేపుతూ తలను మోకాళ్ళకు తగిలిస్తూ
పొట్టనుబాగా లోపలికి లాగండి. కింది శరీర భాగాన్ని
పైకి కదల్చకండి. మీ శ్వాస సాధారణంగానే
వుండేలా చూసుకోండి. పురుషులైతే ఈ వ్యాయామం షర్టు
లేకుండాను, మహిళలు తమ చిన్నిపాటి దుస్తులతోను
చేస్తే సూర్య రశ్మి కూడా
సోకి అధికంగా విటమిన్ డి లభిస్తుంది. మంచి
చర్మకాంతి చేకూరుతుంది.
ఈ రకమైన బీచ్, పార్క్
లేదా బహిరంగ ప్రదేశాలలో వ్యాయామాలు చేయటం మంచిదే. కనుక
ప్రయత్నించి చూడండి.
0 comments:
Post a Comment