ఎస్యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా
అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్)
అందిస్తున్న ఆఫ్-రోడర్ ఎస్యూవీ "థార్"లో మరో సరికొత్త
వేరియంట్ను కంపెనీ మార్కెట్లోకి
విడుదల చేసింది. మహీంద్రా తాజాగా విడుదల చేసిన సిఆర్డిఈ
4x4 ఎస్యూవీలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎయిర్ కండిషనింగ్ (ఏసి),
ఇంజన్ ఇమ్మొబిలైజర్లు స్టాండర్డ్ ఫీచర్లుగా
ఉండే విధంగా ఓ సరికొత్త వేరియంట్ను కంపెనీ మార్కెట్లోకి
విడుదల చేసింది.
మహీంద్రా
థార్ ఎస్యూవీని ఆఫ్-రోడ్ అడ్వెంచర్ రైడ్లంటే ఇష్టపడేవారు, యువకులు
ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే, తమ రోజూవారీ కార్యకలాపాల
కోసం కూడా కొందరు ఈ
ఎస్యూవీని కొనుగోలు చేస్తారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం వేసవి సీజన్ కూడా
కావడంతో ఎయిర్ కండిషనింగ్తో
కూడుకున్న ఈ సరికొత్త వేరియంట్ను మహీంద్రా అండ్
మార్కెట్లోకి తీసుకు వచ్చింది.
కేవలం
సిఆర్డి వెర్షన్లో
మాత్రమే ఏసి ఫీచర్ను
పరిచయం చేయటం జరిగింది. కాగా..
డిఐ వేరియంట్ థార్ ఏసి లేకుండా
మార్కెట్లో లభిస్తుంది. ఏసి వేరియంట్ థార్
ధరను రూ.6,86,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.
ఈ వేరియంట్లో ఉపయోగించిన 2.5 లీటర్ సిఆర్డిఈ
కామన్ రైల్ టర్బో డీజిల్
ఇంజన్ 105 బిహెచ్పిల శక్తిని, 247 ఎన్ఎమ్ల టార్క్ను
విడుదల చేస్తుంది. ఇది ఫోర్-వీల్
డ్రైవ్ ఆప్షన్తో లభిస్తుంది.
0 comments:
Post a Comment