విజయనగరం:
కర్ణాటక మాజీ మంత్రి గాలి
జనార్దన్ రెడ్డి పక్కనే జైలులో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు గది
ఖాళీగా ఉందని తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
అన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ చేపట్టిన
ధర్నాలో ఆయన సోమవారం ప్రసంగించారు.
కాంగ్రెసు కూడా పోటీ ధర్నాకు
దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి తెలుగుదేశం నాయకుడు అశోక్ గజపతిరాజు ప్రయత్నించారు.
ఉద్రిక్త
వాతావరణంలో తోపులాట జరగడంతో మాజీ మంత్రి అశోక్
గజపతి రాజు స్పృహ తప్పి
పడిపోయారు. తెలుగుదేశం నాయకులు అశోక్ గజపతి రాజు,
వర్ల రామయ్య, బండారులను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు
చేసుకుంది.
బొత్స
సత్యనారాయణను చంద్రబాబు రావణాసురుడితో పోల్చారు. రాష్ట్రంలోని మద్యం మాఫియాకు గాలి
జనార్దన్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని ఆయన
వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా ప్రజలు బొత్స సత్యనారాయణను ఎలా
భరిస్తున్నారో అర్థం కావడం లేదని
ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై వెనక్కి
తగ్గేది లేదని ఆయన అన్నారు.
ప్రభుత్వం దొంగలకు కొమ్ము కాస్తోందని ఆయన విమర్శించారు. పోలీసులు
చంద్రబాబును అడ్డుకున్నారు.
కలెక్టర్
కార్యాలయం ఓ గేటు వద్ద
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టగా, మరో
గేటు వద్ద కాంగ్రెసు కార్యకర్తలు
ధర్నా చేపట్టారు. చంద్రబాబునాయుడిని విమర్శిస్తూ కాంగ్రెసు నాయకులు తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి వెళ్లాలని కాంగ్రెసు
నాయకులు డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment