ఎన్టీఆర్,
బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ
చిత్రం ‘దమ్ము’ త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ
చిత్రం ‘ఆరమ్ తంపురాన్’ అనే మలయాళ సినిమా
నుంచి ఎత్తారని వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ
చిత్రం కథ ఏమిటి... ఎప్పుడు
ఆ మళయాళ చిత్రం విడుదల
అయ్యింది అనే విషయంపై ఆందరికీ
ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాను 1997లో
మోహన్ లాలా హీరోగా దర్శకుడు
షాజీకైలాస్ రూపొందించారు. ఈ సినిమా అప్పట్లో
కేరళలో సూపర్హిట్ అయి
250రోజులు ఆడింది. ఈ చిత్రంలో మోహన్లాల్ సరసన మంజువారియర్,
ప్రియారామన్ నటించారు. ఈ సినిమా పాటలకు
రవీంద్రన్, నేపథ్యానికి రాజమణి సంగీతం అందించారు.
ఇక ఈ చిత్రం కథ
విషయానికి వస్తే... ఆరమ్ తంపురాన్ కథ
కేరళలోని మారుమూల గ్రామంలో జరుగుతుంది. నందకుమార్ అనే వ్యాపారవేత్త చిన్న
ఇబ్బంది వచ్చి, పరిష్కారం కోసం జగనాథన్ అలియాస్
జగన్(మోహన్ లాల్)ను సహాయం
కోరడంతో మొదలవుతుంది. జగన్ వచ్చి ఆ
సమస్యను పరిష్కరిస్తాడు. దాంతో ఏం కావాలో
అడగమనడంతో, కనిమంగళం అనే ఊరిలో వున్న
ఓ భవంతి కావాలని అడుగుతాడు.
అది కూడా ఆ భవంతి
తన పేరున వద్దని, నందకుమార్
పేరునే వుండాలని, తాను రిప్రజెంటివ్ గా
మాత్రం వెళ్తానని అడుగుతాడు. సరే, అని ఆ
మేరకు పని పూర్తిచేస్తాడు నందకుమార్.
దీంతో కథ పల్లెకు మారుతుంది.
ఆ పల్లెలో హీరో తీసుకున్న ఆ
పురాతన భవంతిలో ఓ సంగీతం మాస్టారు,
ఆయన కుమార్తె(మంజువారియర్) వుంటూవుంటారు. అదే గ్రామంలో ఓ
భూస్వామి, అతగాడి అనుచరగణం, వారికి ఈ వ్యవహారం ఇష్టంలేకపోవడం
వంటి సంగతులు వుంటాయి. పాలెస్లో కథ కాస్త
చంద్రముఖి సినిమాలో నయనతార, రజనీకాంత్ల నడుమ వుండే
సన్నివేశాలను గుర్తుకుతెస్తూంటాయి. రాను రాను అక్కడి
జనాల సమస్యల్లో జోక్యం చేసుకోవడం ద్వారా జగన్ వారికి నాయకుడిగా
మారే పరిస్థితి వస్తుంది. ఇది భూస్వామికి నచ్చదు.
మరోపక్క
గ్రామంలో అమ్మవారి ఉత్సవాన్ని 16ఏళ్ల తరువాత భారీగా
చేయడానికి యత్నాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవానికి భూస్వామి
వర్గం అడ్డంకులు కల్పించి, పూజారిని రాకుండా చేస్తారు. అప్పుడు అసలు రహస్యం బయటపడుతుంది.
ఆ గుడి ప్రధాన పూజారి,
ఒకప్పుడు దేవుడి నగలు కాజేసారని అపవాదు
వేయడంతో అవమానంతో మరణిస్తాడు. అతగాడి కొడుకే ఈ జగన్. ఆ
రహస్యం చెప్పి, యజ్ఞోపవీతం ధరించి ఉత్సవాలు జరిపిస్తాడు.
కానీ
ఇంతలో ఎవరిచేతైతే జగన్ ప్యాలస్ కొనిపించాడో,
ఆ స్నేహితుడు వచ్చి, సంగతులన్నీ తెలుసుకుని, అతగాడ్ని బయటకు పొమ్మనడంతో కథ
కొత్త మలుపు తిరుగుతుంది. కనీసం
ఒక్క రోజు వుండనిమ్మని అడిగినా
అతగాడు వినడు. ఇంతలో యువ పూజారి
వచ్చి జగన్ను గుడి
నుంచి తప్పిస్తారు. ఆఖరికి జనం కోసం జగన్
పోరాడి, భూస్వామి తల తీయడంతో కథ
కొలిక్కి వస్తుంది.
0 comments:
Post a Comment