మరో తెలుగు దర్శకుడు ప్రపంచ సినిమా ఫ్లాట్ ఫారమ్ మీద అడుగు
పెట్టబోతున్నాడు. ఇప్పటికే ఆర్.పి. పట్నాయక్
"Amy - The Movie" అనే
ఇంగ్లీష్ చిత్రం ద్వారా వార్తల్లోకెక్కగా....తాజాగా దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి
తన తొలి ఇంగ్లీష్ చిత్రం
‘డైవోర్స్ ఇన్విటేషన్’(Divorce
Invitation) చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్దం అయ్యారు.
రొమాంటిక్
కామెడీ చిత్రంగా రూపొందిన ఈచిత్రంలో అందరూ హాలీవుడ్ నటులే
నటించారు. ఇప్పటికే 38 తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉన్న ఎస్.వి.కృష్ణారెడ్డి చాలా గ్యాప్ తీసుకుని
ఏకంగా హాలీవుడ్ సినిమాతో అందరి దృష్టిని తన
వైపుకు తిప్పుకున్నాడు. ఈచిత్రానికి గాను ఆయన బాలారాజశేఖరునితో
కలిసి స్ర్కిప్టు వర్క్ చేశారు.
ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్లు జానథన్ బానెట్, జామీ లైన్ సింగ్లర్,
నదియా బ్జోర్లిన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం విషయమై ఎస్.వి.కృష్టారెడ్డి
సన్నిహితుడైన ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డిని ప్రశ్నించగా....త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి కృష్ణారెడ్డి సిద్దంగా ఉన్నారని చెప్పారు.
0 comments:
Post a Comment