రామ్,
తమన్నా జంటగా కరుణాకరన్ దర్సకత్వంలో
రూపొందిన చిత్రం 'ఎందుకంటే ప్రేమంట'. ఈ చిత్రం షూటింగ్
పూర్తైంది. బీదర్ లో లాస్ట్
షెడ్యూల్ తో ఈ షెడ్యూల్
పూర్తైంది. ఇక ఈ రోజే
ఆడియో విడుదలకు సిద్దమవుతోంది. అన్నపూర్ణ ఏడెకరాలు స్టూడియోలో ఈ ఆడియో పంక్షన్
జరగనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. లవ్ ఎంటర్టైనర్ గా
ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం విజయంపై
రామ్ చాలా నమ్మకంగా ఉన్నారు.
ఇర ఈ చిత్రం గురించి
కరణాకరన్ మాట్లాడుతూ..అబ్బాయి రాసిన లేఖలో పిచ్చి
రాతలన్నీ కవితల్లా కనిపిస్తే... అమ్మాయి చేత్తో ఇచ్చిన కషాయం కూడా కమ్మని
పానీయంలా అనిపిస్తే... ఆ ఇద్దరూ తప్పకుండా
ప్రేమలో ఉన్నట్టే. ప్రేమలోపడితే లోకమే గమ్మత్తుగా అనిపిస్తుంది.
అదే విచిత్రాలు చేయిస్తుంది. ప్రేమలో పడిన ఓ జంటకూ
ఇదే అనుభూతి కలిగింది. ఆ కథేమిటో తెలియాలంటే
మా ' ఎందుకంటే ప్రేమంట'సినిమా చూడాల్సిందే అన్నారు.
నిర్మాత
స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ ''ప్రేమలోని అనుభూతుల్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆ
క్షణాల్ని ఆస్వాదించాలంతే. మా సినిమాలో వాటిని
వెండి తెరపై ఆవిష్కరించాం. రామ్
ఈ సినిమాతోనే తమిళంలో అడుగుపెడుతున్నాడు. రామ్ చెన్నైలోనే పుట్టి
పెరిగాడు. తమిళ భాషపై మంచి
పట్టు ఉంది. ఇక తమన్నా
అక్కడి ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. ఈ
ప్రేమ కథ అన్ని భాషలవారికీ
నచ్చుతుంది. ఇటీవలే తమిళనాడులోనూ ప్రచారానికి శ్రీకారం చుట్టాము''అన్నారు.
ఈ చిత్రాన్ని మే 31న విడుదల
చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హీరో రామ్ చెప్పారు.
అదే విధంగా ఈ చిత్రాన్ని తమిళంలో
‘ఎన్ ఎండ్రల్ కాదల్ ఎన్బెన్’ పేరుతో
విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ జూన్
లో విడుదలయ్యే అవకాశం ఉంది. యువతరాన్ని వెంటాడే
ప్రేమ కథగా ఈ చిత్రం
రూపొందుతుందని, కరుణాకరన్ కలర్ఫుల్గా
చిత్రీకరిస్తున్నారని, జెనీవా స్విట్జర్లాండ్లలో షూట్ చేసిన
పాటలు హైలెట్గా ఉంటాయని తెలిపారు.
రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్శెట్టి తదితరులు
నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:
జి.వి.ప్రకాష్ కుమార్,
నిర్మాత: పి.రవికిషోర్, కథ,
స్క్రీన్ప్లే, దర్శకత్వం: కరుణాకరన్







0 comments:
Post a Comment