కావ్యాసింగ్,
ఆర్యమన్ కాంబినేషన్లో సూర్యలోక్ ఫిలిమ్స్
ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'ఐ లవ్ యూ
టీచర్' చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక
సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు నిర్మాత ఆనంద్ తెలిపారు.
దర్శకుడు
శ్రీసత్య మాట్లాడుతూ- 'పాత్రలకు తగ్గ నటీనటులను ఎన్నుకొని,
నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా సినిమా
తీస్తున్నాం. ముంబాయికి చెందిన కావ్యాసింగ్ టీచర్ పాత్రను అద్భుతంగా
పోషిస్తోంది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆర్యమన్ ఈ సినిమా స్టూడెంట్‌గా బాగా చేస్తున్నాడు
కానీ ముద్దు సీన్లో నటించడానికి
మొదట ఇబ్బంది పడినా తరువాత మొహమాటం
లేకుండా నటించాడు. సన్నివేశపరంగా ఆర్టిస్టులు ఇన్ వాల్వ్ అయి
నటించినప్పుడే సీన్ రక్తి కడుతుంది.
ఆసక్తికరమైన సంఘటనలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ
పొందుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.
'ఈ సినిమాలో నాది టిపికల్ టీచర్
పాత్ర. వెరీ ఇంటెలిజెంట్ టీచర్.
గ్లామర్ కూడా కలిగిన ఇటువంటి
పాత్రను పోషిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని కావ్యాసింగ్
తెలిపింది. ఆనంద్ నిర్మిస్తున్న ఈ
చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీసత్య.
0 comments:
Post a Comment