వీర్య
దానం, అద్దెగర్భం గురించి చర్చించే కాన్సెప్టుతో రూపొందుతున్న చిత్రం ‘వికీ డోనర్’. జాన్ అబ్రం నిర్మిస్తున్న
ఈచిత్రం ద్వారా ఆయుష్ మాన్ ఖురానా,
యామీ గౌతం, అను కపూర్
ఈ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం
అవుతుండగా, సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నిన్న(ఏప్రిల్ 20) విడుదలైంది.
ఈ సినిమా చూసిన మహిళ ప్రేక్షకులు
జాన్ అబ్రహంను వీర్యం ఇవ్వాలని కోరుతున్నారట. దీనిపై జాన్ స్పందిస్తూ.....‘వీర్య
దాతల పేర్లు రహస్యంగా ఉండాలి, మంచి జరుగుతుందంటే నేనూ
చేస్తా, ఎవరైనా పిల్లలు నా పోలికలతో ఉంటే
ఆ మహిళకు నేను వీర్యం ఇచ్చినట్లు
తెలిసి పోతుంది. ఆ తర్వాత కొన్ని
సమస్యలు ఏర్పడవచ్చు, అందుకే నాకు కాబోయే భార్యకు
మాత్రమే చేయాలని అనుకుంటున్నాను’ అని
చెప్పుకొచ్చాడు.
ఈ చితంలో మీరు ఎందుకు నటించలేదు
అని మీడియా అడిగిన ప్రశ్నకు జాన్ స్పందిస్తూ....సినిమా
స్క్రిప్టు ప్రకారం కొత్తవాళ్లతో అయితేనే బాగుటుందని భావించా, నా తొలి చిత్రం
‘జిస్మ్’ చిత్రం
కంటే ముందు ఈ సినిమా
వచ్చి ఉంటే తప్పకుండా నటించే
వాన్ని అని స్పష్టం చేశాడు.
ఈ చిత్రం చూసిన వారు వీర్య
దానం గురించి పాజిటివ్ వేలో ఆలోచిస్తారని ఆశాభావం
వ్యక్తం చేశాడు.
రూ.
20 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం తొలి
రోజు 1.5 కోట్ల వసూళ్లూ సాధించింది.
ఈ చిత్రానికి జుహి చతుర్వేది కథను
అందించారు. జాన్ అబ్రహం ఎంటర్
టైన్మెంట్స్, ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్
సంస్థలు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్
చేస్తున్నాయి.
0 comments:
Post a Comment