'జోష్'తో తెలుగు
తెరకు పరిచయమైన కార్తీక ఆ తర్వాత ఏ స్టైయిట్ చిత్రం చేయలేదు. మళ్లీ రీసెంట్ గా ఎన్టీఆర్
దమ్ము చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు నీలవేణి. ఆ పాత్ర సెకండ్
హీరోయిన్ గా తెరపై అలరిస్తుంది. త్వరలో విడుదల కాబోతున్న దమ్ము చిత్రంపై చాలా అంచనాలు
ఉన్నాయి. ఈ చిత్రం ఆమెకు తెలుగులో కెరీర్ ఇస్తుందని భావిస్తోంది. తనకు కంటిన్యూగా ఈ
చిత్రం విడుదల అయ్యాక ఆఫర్స్ వస్తాయని కార్తీక చెపుతోంది.
ఆమె దమ్ములో
తన పాత్ర గురించి మాట్లాడుతూ...'జోష్', 'రంగం' చిత్రాల్లోని పాత్రలకు భిన్నంగా కనిపిస్తాను.
దీంట్లో నా పాత్ర పేరు నీలవేణి. ఘనమైన వంశ చరిత్ర కలిగిన ఓ పెద్ద కుటుంబానికి చెందిన
యువతిని. ఇక అలాంటి కుటుంబంలో ఉన్న యువతి పాత్ర ఎంత హుందాగా, హంగామాగా ఉంటుందో ప్రత్యేకంగా
చెప్పనవసరం లేదు. నటన విషయానికొస్తే... నవరసాలూ పలికించే అవకాశం దక్కింది. హీరోయిన్
గా తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే ఇలాంటి పాత్ర దక్కడం సంతోషంగా అనిపించింది అంది.
ఇక ఎన్టీఆర్
గురించి చెపుతూ...ఎన్టీఆర్ సరసన హీరోయిన్ అంటే... డాన్స్ లో చాలా కష్టపడాలి ... ఆయనతో
సినిమా అనగానే నాకు ముందుగా గుర్తొచ్చింది కూడా డ్యాన్సే. క్లిష్టమైన భంగిమల్ని కూడా
అలవోకగా చేసేస్తారు. నిజంగా తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన్నించి ఎప్పటికప్పుడు కొత్త
స్టెప్పులు ఆశిస్తుంటారు. 'దమ్ము'లో ఆయన చాలా బాగా చేశారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్
అయితే హైలైట్‌గా నిలుస్తుంది. సెట్‌లో ఆయన డాన్స్ లు చూసి షాక్ అయ్యాను. ఎన్టీఆర్
ఏం చేసినా మనసుపెట్టి చేస్తారు... అది నటన అయినా,డాన్స్ అయినా , ఫైట్ అయినా అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే ఎన్టీఆర్
కే దమ్ము ఉంది. అంతటి మగాడు అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు కాదు. దమ్మున్నోడే సిసలైన
మొనగాడు. అంటే ఒక్క చేత్తో వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం వంద దెబ్బలకు ఎదురు
నిలవడం. ఆ కుర్రాడూ అంతే! నమ్ముకొన్న వారి కోసం తన దమ్ము చూపించాడు. అదెలాగో తెలియాలంటే
మా సినిమా చూడాల్సిందే అన్నారు బోయపాటి శ్రీను.త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న
ఈ చిత్రానికి అలెగ్జాండర్ వల్లభ నిర్మాత. ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్
గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ..''ఎన్టీఆర్ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం.
మాస్ యాక్షన్ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు.
0 comments:
Post a Comment