వరంగల్
జిల్లా పరకాల స్థానం నుంచి
తెలంగాణ ఎజెండాగా పోటీ చేయాలనే వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నాయకురాలు కొండా సురేఖ ఆశలు
కార్యరూపం దాల్చడం లేదు. వైయస్ రాజశేఖర
రెడ్డి కోసం తాను మంత్రి
పదవికి రాజీనామా చేశానని, తెలంగాణ కోసం శానససభా సభ్యత్వానికి
రాజీనామా చేశానని, అందువల్ల పరకాలలో తెలంగాణవాదులు తనకు పరకాలలో మద్దతు
ఇవ్వాలని ఆమె అంటూ వస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు
మద్దతిస్తూ కాంగ్రెసు పార్టీ విప్ను ధిక్కరించడంతో
ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో
పరకాల శానససభా స్థానం ఖాళీ అయింది.
పరకాల
స్థానం నుంచి మళ్లీ పోటి
చేసే ఆలోచనలో ఆమె ఉన్నారు. అయితే,
ఆమె తెలంగాణవాదంపై పోటీ చేసి విజయం
సాధించాలని అనుకున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆమెను బలపరచడానికి సిద్ధంగా
లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కూడా
ఆమె కొంత కాలం క్రితం
అనుకున్నారు. అయితే, అది కూడా అంతగా
కలిసి వచ్చేట్లు కనిపించడం లేదని ఆమె గ్రహించినట్లున్నారు.
ఇప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి
సెంటిమెంటుపైనే ఆధారపడదలుచుకున్నారు.
తాను
వైయస్సార్ ఎజెండాగా పోటీ చేస్తానని, వైయస్
రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని ప్రచారం
సాగిస్తానని ఆమె శుక్రవారం చెప్పారు.
దీన్నిబట్టి ఆమె వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ తరఫుననే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు
అర్థమవుతోంది. తెలంగాణ సెంటిమెంటుపై ఇతర పార్టీల మద్దతు
పొందాలనే ఆమె వ్యూహం బెడిసికొట్టడంతో
ఆమె వైయస్సార్ కాంగ్రెసు నుంచే పోటీ చేయాలని
నిర్ణయించుకున్నారని అంటున్నారు.
ఉప ఎన్నికలు జరిగే 18 స్థానాల్లో పరకాల మాత్రమే తెలంగాణలో
ఉంది. దీంతో తెలంగాణలో వైయస్సార్
కాంగ్రెసు పార్టీ భవిష్యత్తును పరకాల సీటు నిర్ణయిస్తుందని
అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పరకాలలో తాము పోటీ చేస్తామని
ప్రకటించడం, బిజెపి కూడా పోటీకి సిద్ధపడడం,
సస్పెండయిన డిఎస్పీ నళిని స్వతంత్ర అభ్యర్థిగా
పోటీ చేస్తానని చెప్పడం, మద్దతు ఇవ్వడానికి తెలంగాణ జెఎసి ముందుకు రాకపోవడం
వంటి కారణాలు తెలంగాణ ఎజెండాపై పోటీ చేసేందుకు సురేఖకు
ఆటంకంగా మారాయి.
వైయస్
జగన్తో పార్లమెంటులో వైయస్
జగన్ చేత తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటుకు మద్దతిస్తామని చెప్పిస్తే పరకాలలో బలపరుస్తామని తెరాస కొండా సురేఖకు
షరతు పెట్టింది. అది సాధ్యమయ్యే పని
కాకపోవడంతో సురేఖ తెరాసపై ఆశలు
వదిలేసుకున్నారు. ఏమైనా, పరకాల ఉప ఎన్నిక
కొండా సురేఖకే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కూడా అగ్నిపరీక్ష కానుంది.
0 comments:
Post a Comment