విజయవాడ/రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బందరు పోర్టు
కోసం ముప్పై వేల ఎకరాలు ఇస్తాడని,
బందరు మాయం చేస్తాడని మాధ్యమిక
విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఆదివారం ఆరోపించారు. జగన్ వస్తే రెండేళ్లలో
పోర్టు నిర్మిస్తామని ప్రకటించిన విషయాన్ని విలేకరులు పార్థసారథి వద్ద ప్రస్తావించారు. దీనికి
ఆయన జగన్ అధికారంలోకి వస్తే
పోర్టు పేరుతో కేటాయించే భూముల కారణంగా బందరు
కూడా ఖాళీ చేయాల్సి ఉంటుందని
ఎద్దేవా చేశారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీకి జెండా, అజెండా లేదని కనీసం ఎన్నికల
కమిషన్ గుర్తింపు కూడా లేదని సాంఘిక
సంక్షేమ శాఖ మంత్రి పితాని
సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. అవాస్తవ కథనాలు ప్రచురిస్తూ అబద్దాల పత్రికగా సాక్షి దిన పత్రిక మారిందని
ఆరోపించారు. 2004 తర్వాత కాంగ్రెసు ప్రవేశ పెట్టిన ఏ ఒక్క పథకం
ఆగిందో చెప్పాలని ఆయన జగన్కు
సవాల్ విసిరారు. వైయస్ మరణానంతరం నిలిచిపోయిన
పథకాలేవో తెలిపేందుకు దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు
రావాలన్నారు.
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి
రెండు సార్లు పిసిసి, రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఆయన సోదరుడు, కుమారుడిని
ఎంపీలుగా కాంగ్రెసు పార్టీ చేసింది ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీయేనని బిసి సంక్షేమ శాఖ
మంత్రి బస్వరాజు సారయ్య రాజమండ్రిలో అన్నారు. తన రక్తంలో కాంగ్రెసు
జీర్ణించుకోపోయిందని, పార్టీని నమ్ముకున్న ఎవరికీ అన్యాయం జరగలేదని ఆయన చెప్పారు.
తరుచూ
ఉప ఎన్నికలు, ప్రజలబై పెను భారం మోపుతాయని
ఈ ఎన్నికల వల్ల దాదాపు రూ.100
కోట్ల భారం ప్రజలపై పడనుందని
ఏఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి వేరుగా హైదరాబాదులో అన్నారు. ఒక వ్యక్తి సిఎం
కావాలన్న కోరికతో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం వల్లే ఇప్పుడు ఉప
ఎన్నికలు వచ్చాయని ఆయన జగన్ను
ఉద్దేశించి అన్నారు.
0 comments:
Post a Comment