హైదరాబాద్:
వ్యభిచార కుంభకోణంలో అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరి
కేసులో ఆమె అసిస్టెంట్ హనీఫ్‌ను బంజారాహిల్స్ పోలీసులు
గురువారం రాత్రి అరెస్టు చేశారు. అతనిని మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. అతనిని తమ కస్టడీకి అప్పగించాలని
పోలీసులు కోర్టును కోరే అవకాశం కూడా
ఉంది. ఇప్పటికే తారా చౌదరి, ఆమె
భర్త ప్రసాద్‌ను నాలుగు రోజుల
పాటు పోలీసులు తమ కస్టడీకి తీసుకొని
విచారించిన విషయం తెలిసిందే.
హనీఫ్
కోసం పోలీసులు చాలా రోజులుగా వెతుకుతున్నారు.
ఈయనను విచారిస్తే ఎవరెవరు ఈ కేసులో ఉన్నారనే
విషయం తెలిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. హనీఫ్ సిడిలు తదితరాలు
రూపొందించారు. దీంతో అతని పాత్ర
చాలా ఉండి ఉంటుందని అనుమానం
వ్యక్తం చేస్తున్నారు. హనీఫ్‌ను విచారిస్తే
ఎవరి పేర్లు బయటపడతాయో అనే చర్చ జరుగుతోంది.
కాగా
తారా చౌదరికి రెండు రోజుల క్రితం
బుధవారం నాంపల్లి కోర్టులో చుక్కెదురయిన విషయం తెలిసిందే. ఆమె
బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టి
వేసింది. కాగా తనకు బెయిల్
ఇవ్వాలని తారా చౌదరి ఇటీవల
నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై
మంగళవారం వరకు కోర్టు ఇరువైపుల
వాదనలు విన్నది. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. అనంతరం ఈ రోజు బెయిల్
పిటిషన్‌ను కొట్టి వేసింది.
ఉద్యోగాలు,
సినిమాలలో అవకాశాల పేరుతో అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి నెడుతోందనే ఆరోపణలపై తారా చౌదరిని పోలీసులు
అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
బంజారాహిల్స్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
అనంతరం ఆమెను, ఆమె భర్త ప్రసాద్‌ను కోర్టులో ప్రవేశ
పెట్టారు. వారిని తమ కస్టడీకి అప్పగించాలని
కోరారు.
కోర్టు
తారా చౌదరిని, ప్రసాద్‌ను నాలుగు రోజుల
పోలీసు కస్టడీకి అప్పగించింది. వారిని నాలుగు రోజుల పాటు విచారించిన
పోలీసులు ఎన్నో కీలక ఆధారాలు
సేకరించినట్లుగా వార్తలు వచ్చాయి. తారా లిస్టులో ప్రముఖులు,
రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు
గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. ఇది సంచలనం రేపింది.
0 comments:
Post a Comment