ఆటోమొబైల్ రంగంలో వండర్లు చేయాలంటే టాటా మోటార్స్కు సాటి మరొకరా రారనే చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత చవక ధరకే కారును ప్రజలకు అందించాలని ఆలోచించి, ఆ ఆలోచనకు వాస్తవ రూపం కల్పించి మధ్య తరగతి ప్రజల కారు కలను నిజం చేసిన దేశపు ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్, ఇప్పుడు తాజాగా నీరు, గాలి వంటి ప్రత్యామ్నాయ వనరులతో నడిచే కార్లను అభివృద్ధి చేసే పనిలో ఉంది.
సరే ఇదంతా అటువైపు ఉంచి అసలు విషయానికి వస్తే, ఈ ఫోటోలో ఉన్న కారును గమనించారా..! ఇది టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన బుల్లెట్ ప్రూఫ్ నానో కారు. సాధారణ నానో కారులో సురక్షిత మాటేమో గానీ, ఈ బుల్లెట్ ప్రూఫ్ నానో కారులో మాత్రం భారత సైనికులు సురక్షితంగా ఉంటారని టాటా మోటార్స్ భరోసా ఇస్తుంది.
ఇటీవల న్యూఢిల్లో జరిగిన యుద్ధ, సైనిక వాహనాల ప్రదర్శన ఢిఫెక్స్పో 2012లో టాటా మోటార్స్ ఈ "మైక్రో బుల్లెట్ ప్రూఫ్ వాహనం"ను ప్రదర్శనకు ఉంచుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ చిన్న కారు రెండు సీట్లను కలిగి ఉండి ఎలక్ట్రిక్ పవర్ (బ్యాటరీ)తో పనిచేస్తుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటల పాటు నడుస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ వాహనానికి చుట్టువైపులా కొన్ని చిన్న పాటి రంధ్రాలు ఉంటాయి.
ఈ రంధ్రాల ద్వారా కారు లోపల ఉన్న సైనికులు శత్రువులపై తుపాకులతో దాడి చేసేందుకు సహకరిస్తాయి. ఈ బుల్లెట్ ప్రూఫ్ నానో కారు మెట్లను కూడా ఎక్కగలదు. తీవ్రవాదుల దాడులను తిప్పికొట్టేందుకు ఈ కాన్సెప్ట్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం సైన్యం ఉపయోగం కోసం మాత్రమే, మిలటరీ రీసెర్చ్ విభాగంతో కలిసి టాటా మోటార్స్ అభివృద్ధి చేసింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ ఎలక్ట్రిక్ నానో కారు గంటకు గరిష్టంగా కేవలం 20 కి.మీ. వేగంతోనే పరుగులు తీస్తుంది.

0 comments:
Post a Comment