'దమ్ము' లాంటి
కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశం కూడా అరుదుగానే వస్తుంది. వచ్చినప్పుడు నా పాత్ర
పరిధి ఎంత.. ఎన్ని నిమిషాలు కనిపిస్తాను... ఇలాంటి లెక్కలు కూడా వేసుకోకూడదు. 'నువ్వొస్తానంటే
నేనొద్దంటానా', 'వర్షం' సినిమాలు నాకెంత అవసరమో, 'బాడీగార్డ్', 'దమ్ము' లాంటి సినిమాలు
కూడా అంతే అవసరం'' అంటూ చెప్పుకొచ్చింది త్రిష. ఆమె తాజాగా దమ్ము చిత్రంలో నటించింది.
అయితే చిత్రంలో ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. ఆ విషయమై మీడియా వారు అడిగితే ఇలా
స్పందించింది.
అలాగే... నేను
ఏదైనా ఓ సినిమా ఒప్పుకొంటున్నానంటే రెండే విషయాలు ఆలోచిస్తా. ఆ సినిమాకు నేను ఉపయోగపడాలి,
లేదంటే సినిమా వల్ల నాకు ఉపయోగం ఉండాలి. ఈ రెండింటిలో ఏ అంశం ఆకర్షించినా నేను నటించడానికి
సిద్ధం'' అంటూ చెప్పు కొచ్చింది త్రిష. 'దమ్ము'లో ఆమె చేసిన గ్లామర్ పాత్ర అందరినీ
ఆకట్టుకుంటోందని చెప్పుకొచ్చింది. ఇక.. నా కెరీర్ మొత్తం ఓ పద్ధతి ప్రకారం నడిచింది.
ఏ సమయంలో ఎలాంటి సినిమాతో జనం ముందుకు రావాలో తెలుసుకొన్నాను. జెస్సీ, సిరి, కీర్తి....
ఇలాంటి పాత్రలు కావాలి అనగానే దొరికేయవు. వచ్చినప్పుడు వదులుకోకూడదు అని వివరణ ఇచ్చింది.
ఇక త్రిష.. దమ్ము
చిత్రంలో సత్య అనే పాత్రలో కనిపించింది. ఆమె ఓ పెద్ద కోటీశ్వరుడు కూతురు. ఆమెతో అనాధ
అయిన ఎన్టఆర్ ప్రేమలో పడతాడు. అయితే ఆమె తన తండ్రి అనాధకు ఇచ్చి పెళ్లి చేయడని చెప్పటంతో
ఎన్టీఆర్ ఓ పెద్ద జమీందారి కుటుంబానికి వారసడుగా దత్తతకు వెళతాడు. అక్కడ నుంచి కథ మలువు
తిరుగుతుంది. అలా కథలో కీలకమైన ట్విస్టుకు త్రిష పాత్రే లీడ్ ఇస్తుంది. అయితే సినిమాలో
మరో పాత్ర కార్తీక ది ఉండటంతో సినిమాలో ఆమె పాత్ర పరిధి తగ్గిపోయింది. సెకండాఫ్ లో
అయితే అసలు త్రిష పాత్రకు సీన్స్ దాదాపు లేనే లేవు. కేవలం పాటలకే పరిమితం చేసారు.
ఒక దశాబ్దకాలానికి
పైగా తిరుగులేని ఆధిపత్యం చలాయించిన త్రిషకు మరో ప్రక్క సినిమా రంగంలో అసలైన కష్టాలు
ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొందరు హీరోలు ఆమెను దూరం పెడుతున్నారు. అన్నింటికన్నా
ప్రధానంగా ఆమె వయసు సమస్య ఏర్పడుతోంది. యంగ్ హీరోలు ఆమెను తమ ప్రక్కన తీసుకోవాలంటే
ఒకటికిపదిసార్లు ఆలచిస్తున్నారు. దానికి తోడు ఆమెకు ఈ మధ్య కాలంలో హిట్స్ ఏమీ లేవు.
అందులోనూ తనకన్నా వయసులో తక్కువ అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో నటించాల్సి వచ్చినప్పుడు
త్రిషకు ఎక్కడ ఏజ్ ఎక్కువగా కనిపిస్తుందా అని ఆందోళన ఎక్కువైపోయిందని వార్తలు వచ్చాయి.
0 comments:
Post a Comment