మీ కారు మైలేజ్ ఎంత
ఇస్తుంది. మహా అయితే 10 కి.మీ. నుండి 20 కి.మీ వరకూ మైలేజిస్తుంది.
అదే ఈ ఫోటోలో కనిపిస్తున్న
కారు అయితే, ఏకంగా ఒక్క లీటర్
ఇంధనానికి 248 కి.మీ మైలేజీనిస్తుంది.
ఏంటి నమ్మడం లేదా. మీరు నమ్మినా
నమ్మకపోయినా ఇది నూటికి నూరుపాళ్లు
నిజం.
కాలిఫోర్నియా
పాలిటెక్నిక్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఓ ఇంజనీర్ల బృందం
సృష్టించిన అద్భుతమే ఈ 'లామినా' కారు.
ఇది ఒక్క గ్యాలన్ (1 గ్యాలన్
= 3.78 లీటర్లు) డీజిల్‌తో 584 మైళ్ల (1 మైలు = 1.609344 కి.మీ, అంటే
మొత్తం 939.9 కి.మీ.) దూరం
ప్రయాణించి రికార్డు సృష్టించింది. టెక్సాస్‌లోని హౌస్టన్‌లో
నిర్వహించిన షెల్ ఎకో-మారథాన్‌లో ఈ కారును
పరిచయం చేయటం జరిగింది.
ఇందులో
ఓ మోడిఫై చేసిన హోండా జనరేటర్‌ను ఉపయోగించారు. సన్నగా,
పొడవుగా ఉండే ఈ కారులో
డ్రైవర్‌కు మాత్రమే చోటు
ఉంటుంది. తక్కువ బరువు ఉండేలా డిజైన్
చేసిన దీని ఏరోడైనమిక్స్ కారణంగా
ఇంత అధిక మైలేజ్‌ను
సాధించటం వీలవుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. మన కార్లు కూడా
ఈ కారు మాదిరిగా ఇంత
మైలేజ్నిస్తే ఎంచక్కా పెట్రోల్/డీజిల్ సమస్యను మర్చిపోవచ్చు. మీరేమంటారు..?
0 comments:
Post a Comment