హైదరాబాద్:
భూవివాదం కేసులో దివంగత నేత వైయస్ రాజశేఖర
రెడ్డి దూరపు బంధువు మర్రెడ్డి
రాజశేఖర రెడ్డి (50) అరెస్టయ్యారు. భూవివాదంలో ఆయనపై చీటింగ్ కేసు
నమోదైంది. హైదరాబాదులోని మహేంద్రహిల్స్లో ఉండే మర్రెడ్డి
రాజశేఖర రెడ్డి బిల్డర్. ఆయన భాగ్యశ్రీ బిల్డర్స్
అనే సంస్థను నడుపుతున్నారు. హస్మత్పేటలోని ప్రాగాటూల్స్ సహకార గృహనిర్మాణ సంస్థకు
చెందిన భూమిని అక్రమంగా విక్రయిస్తున్నట్లు ఆయనపై కేసు నమోదైంది.
పి. శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన
ఫిర్యాదుపై కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మర్రెడ్డి రాజశేఖర
రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు
పోలీసులు తెలిపారు. సొసైటీకి, భాగ్యశ్రీ బిల్డర్స్కు మధ్య 2008లో
వివాదాస్పద భూమికి సంబంధించిన ఒప్పందంపై రాజశేఖర రెడ్డి సంతకం చేశారు.
ఒప్పందం
మేరకు రాజశేఖర రెడ్డి వివాదం ముగిసిన తర్వాత సొసైటీ సభ్యుల కోసం 230 ఫ్లాట్స్ను నిర్మించాల్సి ఉంది.
మిగతావాటిని సొసైటీ సభ్యుల అంగీకారంతో ఆయన అమ్ముకోవచ్చు. ఒప్పందాన్ని
ఉల్లంఘిస్తూ రాజశేఖర రెడ్డి 2011లో ప్రేంసాగర్ అనే
వ్యక్తికి 1.08 కోట్ల రూపాయలకు 1,400 చదరపు
గజాల భూమిని విక్రయించాడని ఫిర్యాదు అందింది.
రాజశేఖర
రెడ్డి సభ్యుల అనుమతి తీసుకోకుండానే ఆ భామిని విక్రయించాడని,
పైగా ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయలేదని పోలీసులు
అంటున్నారు. అంగీకారం మేరకు ఆయన ఫ్లాట్స్
నిర్మించలేదు. రాజశేఖర రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆయనను
సోమవారం చెర్లపల్లి జైలుకు తరలించారు.
0 comments:
Post a Comment