కుదిరితే
సినిమాలు....కుదరక పోతే వ్యభిచారం,
డబ్బు సంపాదించడానికి ఏ మార్గమైతేనేం అని
వంకర ఆలోచనలు చేస్తూ అడ్డదారుల్లో ప్రయాణిస్తున్నారు కొందరు నటీమణులు. ఇప్పటికే పలువురు తారలు ఈ చీకటి
దందాలోకి దిగిన విషయం తెలిసిందే.
తాజాగా మరో బాలీవుడ్ నటి
పడుపు వృత్తి చేస్తూ పోలీసులకు చిక్కింది.
బెంగుళూరులో
రహస్యంగా నిర్వహిస్తున్న వేశ్యా గృహంపై పోలీసులు బుధవారం దాడి చేయగా సనాఖాన్
అనే 26 ఏళ్ల బాలీవుడ్ నటితో
పాటు...విదేశీ యువతులు పట్టుబడ్డారు. కోరమంగళ ప్రాంతంలోని ఆరవ బ్లాక్ అనిషా
మిడోస్ అపార్ట్ మెంటులో బాలీవుడ్ తారలు, విదేశీ యువతులు వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మధ్యవర్తుల ద్వారా విటుల రూపంలో అక్కడి
చేరుకుని రెడ్ హాండెడ్ గా
వారిని పట్టుకున్నారు.
బాలీవుడ్
ఇమేజ్ను అడ్డం పెట్టుకుని
విటుల నుంచి వీరు రోజుకు
రూ. 70,000 నుంచి 80,000 వరకు వసూలు చేస్తున్నారట.
అరెస్టయిన వారిలో నటి సనాఖాన్, కోలిదా
అనే ఉజ్బెకిస్థాన్ యువతి, శిబి, రేష్మి, సమీర్,
కవిరాజ్, వినయ్ కుమార్ తదితరులు
ఉన్నారు.
పోలీసులు
వారి వద్ద నుంచి రూ.
40,000 నగదుతో పాటు రెండు ల్యాప్
టాప్లు, అశ్లీల సీడీలు,
12 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. చాలా రోజుల నుంచి
ఇక్కడ ఈ తతంగం జరుగుతోందని,
రోజూ ఆ అపార్ట్ మెంటులోకి
కొత్త మగాళ్లు, అందమైన యువతులు వచ్చి వెలుతూ ఉంటారని,
అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు
చేశామని చుట్టుపక్కల వారంటున్నారు.
0 comments:
Post a Comment