నందమూరి
బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు’ చిత్రం జూన్ 1న విడుదలవుతున్న
నేపథ్యంలో ఆయన వ్యతిరేక వర్గీయులు
దుష్ప్రచారం మొదలు పెట్టారు. ఫేస్
బుక్ లాంటి సోషల్ నెట్
వర్కులను కేంద్రంగా చేసుకుని ‘అధినాయకుడు’ చిత్రంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
‘రేపు
విడుదలవుతున్న అధినాయకుడు, 108 సర్వీసుల పెంపు, అన్ని థియేటర్ల వద్ద
మెడికల్ క్యాంపులు, తలనొప్పి బిళ్లలను జేబులో వేసుకుని సినిమాకు వెళ్లాలంటూ నిపుణుల సూచన’ అంటూ ఓ ప్రముఖ
టీవీ ఛానల్లో హెడ్
లైన్స్ వచ్చినట్లుగా ఓ మార్ఫింగ్
ఫోటోను సృష్టించి ఫేస్ బుక్లోకి
వదిలారు.
సినిమా
రంగంలో బాలయ్యకు ప్రత్యర్థులుగా ఉన్న హీరోల అభిమానులే
దీన్ని సృష్టించి ఉంటారని అంటున్నారు. అధినాయకుడు చిత్రం కొన్ని రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నందున బహుషా వారుగానీ ఈ
పని చేశారేమో అనే అనుమానాలు వ్యక్తం
అవుతున్నాయి.
ఏది ఏమైనా ఇలాంటి పరిణామాలు
తెలుగు సినీ పరిశ్రమకు నష్టం,
చెడ్డ పేరును తెస్తాయనేది మాత్రం వాస్తవం. ఒక సినిమా జయాపజయాలపై
ఎంతో మంది జీవితాలు ఆధార
పడి ఉంటాయి. వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు ఉన్నా సినిమాల విషయంలో
వాటిని ప్రదర్శించ వద్దని పరిశ్రమపై ఆధార పడ్డ ప్రతి
ఒక్కరూ కోరుతున్నారు.
‘అధినాయకుడు’లో బాలయ్య కెరీర్లోనే తొలి సారిగా మూడు
విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. సలోని, లక్ష్మి రాయ్ బాలయ్యతో రొమాన్స్
చేయనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న
ఈ సినిమాను ఎంఎల్ కుమార్ చౌదరి
కీర్తి కంబైన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కళ్యాణి
మాణిక్ ఈ సినిమాకు సంగీతం
అందించారు.
0 comments:
Post a Comment