హైదరాబాద్:
రక్తచరిత్ర సినిమా విషయంలో దర్శక నిర్మాత రామ్
గోపాల్ వర్మను తమ పార్టీ అధ్యక్షుడు
వైయస్ జగన్ బెదిరించాడని కాంగ్రెసు
పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన ఆరోపణపై వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్రంగా
మండిపడ్డారు. వైయస్ జగన్ను
బద్నాం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అలా బద్నాం చేయడానికి
ప్రయత్నాలు చేస్తున్నవారిలో లగడపాటి చేరిపోయారని ఆయన గురువారం మీడియా
ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్పై
కుట్రలో భాగంగానే వర్మను జగన్ బెదిరించాడని లగడపాటి
ఆరోపణ చేశారని, వర్మ్, లగడపాటి మంచి మిత్రులని ఆయన
అన్నారు.
రక్త
చరిత్ర సినిమా చర్చను ఇప్పుడెందుకు ముందుకు తెచ్చారని ఆయన అడిగారు. వైయస్
జగన్ను అప్రతిష్టపాలు చేయడానికే
ఆ విషయాన్ని ముందుకు తెచ్చారని ఆయన అన్నారు. రాష్ట్రంలో
దురదృష్టకరమైన వాతావరణం సృష్టించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు. వైయస్
జగన్ జైలుకు వెళ్లారనే బాధలో ఉన్నా విజయమ్మ
పర్యటనకు ప్రజల నుంచి విశేషమైన
స్పందన వచ్చిందని ఆయన అన్నారు. ఉప
ఎన్నికల తర్వాత రాజకీయంగా పెను మార్పులు వస్తాయని
ఆయన అన్నారు.
జగన్
జైలుకు వెళ్లిన నేపథ్యంలో పార్టీకి నష్టం జరగకుండా వైయస్
విజయమ్మ ముందుకు రావడం పట్ల ప్రజలు
ఆహ్వానిస్తున్నారని ఆయన అన్నారు. ఇదే
సమయంలో ఆయన మీడియాకు కొన్ని
హితబోధలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
ఆదేశాల మేరకో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఆదేశాల మేరకో విజయమ్మ పర్యటన
వార్తను ఓ వర్గం మీడియా
సరిగా ప్రసారం చేయలేదని, పత్రికల్లో సరిగా ప్రచురించలేదని ఆయన
అన్నారు.
పత్రికలు
భయపడుతున్నట్లున్నాయని ఆయన అన్నారు. మీడియాలో
ఎవరి ఎజెండా వారికి ఉందని, కొందరు కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరించేవారున్నారని, వాస్తవాలను రాసేవారూ ఉన్నారని, మీడియాకు స్వేచ్ఛ ఉందని, ఆ స్వేచ్ఛను వాడుకుని
వాస్తవాలను ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన
అన్నారు. కొన్ని సంఘటనలను సక్రమంగా చూపించాల్సిన నైతిక బాధ్యత మీడియాపై
ఉందని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment