‘గబ్బర్‌సింగ్’
చిత్రం విజయోత్సవాన్ని త్వరలో
ఘనంగా నిర్వహించనున్నట్లు మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. నేటికీ
తొలి రోజు వసూళ్లను తలపించేలా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా
ఉన్న పవర్‌స్టార్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకోవాలనే సదుద్దేశంతో ఈ వేడుక నిర్వహించనున్నామని
గణేష్ చెప్పారు. పవర్‌స్టార్ స్టామినాను తెలిపే విధంగా లక్షలాదిగా ఈ వేడుకకు అభిమానులు
రానున్నారని గణేష్ అన్నారు. ఇంకా ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని
ఆయన చెప్పారు.
ఇక గబ్బర్ సింగ్
రిలీజైన నాటినుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దాంతో ఈ చిత్రం రికార్డులు బ్రద్దలు
కొడుతుందా..కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అనే స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. ఈ
నేపధ్యంలో ఈ చిత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేయాలంటే 72 కోట్లుకు పైగా షేర్ సాధించాలని
ట్రేడ్ లో వినపడుతోంది. ఇదే ఊపు మరో రెండు వారాలు పాటు కొనసాగితే ఆ రేంజికి రావటం కష్టమేమి
కాదంటున్నారు. కొనుక్కున్నవారంతా ఈ చిత్రం తెప్పిస్తున్న కలెక్షన్స్ కు ఉక్కిరిబిక్కిరి
అవుతున్నారు.
గబ్బర్ సింగ్
చిత్రాన్ని పవన్ కళ్యాణ్ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ అదే జోష్ తో చేసి అదరకొట్టాడు.
దబాంగ్ సినిమా నచ్చి తనే స్వయంగా నిర్మిద్దామని కొనుక్కున్నాడు. అలాగే ఎప్పుడో హరీష్
శంకర్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అవకాశం ఇచ్చాడు. పవన్ నమ్మకాన్ని హరీష్ నిలబెడుతూనే..మొదటి
ప్రోమో విడుదలైన వెంటనే విపరీతమైన అంచనాలు పెరిగాయి. నాక్కొచెం తిక్కుంది..దానికో లెక్కుంది
అన్న ప్రోమోకి విపరీతమైన అప్లాజ్ వచ్చింది. అందుకు తగ్గట్లుగా పెరిగిన అంచనాలును నిజం
చేస్తూ విడుదలైన రోజే సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని అందరిలో కలిగించింది.
దర్శకుడు హరీష్
శంకర్ ...ఈ సినిమా సక్సెస్ వెనక సీక్రెట్ వివరిస్తూ... సినిమా అనేది ప్రేక్షకులందరికీ
నచ్చాలి. అభిమానులకు ఇంకొంచెం ఎక్కువ నచ్చాలి. ఈ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని పని
చేశాను.''అన్నారు హరీష్ శంకర్. ఇక ''హిట్టు..ప్లాప్ లను నమ్ముకొని నేను పరిశ్రమకు
రాలేదు. కేవలం పనిని నమ్ముకొని వచ్చాను. వరుసగా రెండు విజయాలు అందుకోవడమంటే... ఒక దర్శకుడిగా
నాపై మరింత బాధ్యత పెరిగినట్లే అని ఖచ్చితంగా చెప్పారు.
0 comments:
Post a Comment