మద్దెలచెర్వు
సూరిని హత్య చేసిన పారిపోయిన
భాను కిరణ్ ఆ తర్వాత
ఏం చేశాడనేది సర్వత్రా ఆసక్తికరంగానే ఉంది. సూరిని చంపిన
మర్నాడు, అంటే 2011 జనవరి 4వ తేదీన అతను
ముంబైలో సినిమా చూశాడట. ముంబైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ థియేటర్లో
అతను తీస్ మార్ ఖాన్
సినిమా చూశాడని అంటున్నారు. ఈ విషయాన్ని భాను
సిఐడి అధికారుల విచారణలో చెప్పాడు.
తన అనుచరుడు మన్మోహన్ సింగ్తో కలిసి
అతను ఆ సినిమా చూశాడట.
సూరి, రామ్ గోపాల్ వర్మ
సూచన మేరకు భాను కిరణ్
2010 డిసెంబర్లో సి. కళ్యాణ్,
సింగనమల రమేష్లకు చెందిన
బాలాజీ కలర్ ల్యాబ్ నుంచి
రక్తచరిత్ర - 2 రీళ్లను బెంగళూర్ తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నారు. బెంగళూర్లోని ఫోరం మాల్లో, మేక్రీలోని మరో
థియేటర్లో ప్రివ్యూ షో
కోసం వాటిని భాను తీసుకుని వెళ్లినట్లు
సిఐడి విచారణలో తేలిందని చెబుతున్నారు.
ఆ స్థితిలోనే భాను కిరణ్తో
లింక్స్ గురించి సిఐడి అధికారులు రామ్
గోపాల్ వర్మను ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముంబైలో తన ఫోటోతో ప్రచురితమైన
వార్తను తెలుగు వార్తాపత్రికల్లో చదవడానికి భాను కిరణ్ ప్రయత్నించాడని
కూడా తెలుస్తోంది.
సూరి
మృతదేహం ఫోటో, ఆ పక్కనే
తన ఫొటో చూసి వెంటనే
తాను రేజర్ కొనుక్కుని సులభ్
కాంప్లెక్స్కు వెళ్లానని, బాత్రూంలో
మీసాలు తొలగించుకున్నానని భాను కిరణ్ సిఐడి
అధికారులకు చెప్పాడు. హైదరాబాదులో తాను పెద్ద వ్యక్తిని
చంపానని, ఆ విషయం పోలీసులు
తనను అరెస్టు చేస్తే చంపేస్తారని తాను మన్మోహన్ సింగ్కు చెప్పినట్లు అతను
తెలిపాడు. ఏమైనా, భాను కిరణ్ వ్యవహారాలు
కథలు కథలుగా ముందుకు వస్తూనే ఉన్నాయి.
0 comments:
Post a Comment