ప్రభాస్,
రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సూపర్
హిట్ చిత్రం 'ఛత్రపతి'. ఈ చిత్రాన్ని హిందీలో
రీమేక్ చేయటానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజమౌళి సినిమాలు 'విక్రమార్కుడు', 'మర్యాదరామన్న' చిత్రాలు అక్కడ రీమేక్ అవుతున్న
నేపధ్యంలో బాలీవుడ్ లోని ఓ పెద్ద
నిర్మాణ సంస్ధ ఈ చిత్రం
రైట్స్ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ ఈ
చిత్రం రీమేక్ లో చేసే అవకాశం
ఉందని చెప్తున్నారు.
ఇక రవితేజతో చేసిన 'విక్రమార్కుడు'ని ప్రభుదేవా ..హిందిలో
అక్షయ్ కుమార్ తో.. 'రౌడీ రాథోడ్'
రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్స్
ఇప్పటికే అక్కడివారి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుని మంచి బిజినెస్ చేసిపెట్టింది.
అలాగే 'మర్యాదరామన్న' చిత్రాన్ని అజయ్ దేవ్గన్తో 'సన్నాఫ్ సర్దార్'
పేరిట రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా
ఇదే ఏడాదిలో విడుదలవుతుంది. ఆ సినిమాకి కూడా
ట్రేడ్ లో మంచి క్రేజ్
వచ్చింది. మరో ప్రక్క 'మగధీర'ని రీమేక్ చేయడానికి
కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
వీటిన్నటికి
తోడు రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'కి బాలీవుడ్ మీడియా
మంచి ప్రయారిటీ ఇస్తోంది. ఈ చిత్రం ట్రెయిలర్తో బాలీవుడ్ దృష్టిని,
నేషనల్ మీడియా అటెన్షన్ని తనవైపుకి తిప్పుకున్నారు.
దాంతో రాజమౌళి చిత్రాలపై బాలీవుడ్ దృష్టి పడింది. అసలే రీమేక్ లో
హిట్లు కొడుతున్న బాలీవుడ్ కి రాజమౌళి సినిమాలు
మినిమం గ్యారెటీ సినిమాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో రాజమౌళి
సినిమాలు రెండూ హిందీలో విడుదల
కావటానికి సన్నాహాలు జరగటం కూడా ప్లస్
అయ్యింది.
ఇక ఈగ విషయానికి వస్తే...ఈ చిత్రం ప్రారంభం
రోజు నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని
రేపుతోంది. అపజయం ఎరగని రాజమౌళి
చిత్రం కావటం,కొత్త కాన్సెప్టు
తో ఈ చిత్రం రూపొందటం,పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే
కథ కావటం సినిమాపై అంచనాలు
పెంచుతున్నాయి. పెరిగిన అంచనాలకు ఈ బడ్జెట్ పెద్ద
మొత్తమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకుల
అంటున్నారు. ఇక ఈ చిత్రంలో
నాని సరసన సమంత హీరోయిన్
గా చేస్తోంది.
‘ఈగ’ సబ్జెక్ట్
సెంట్రల్ పాయింట్ ఏమిటంటే ‘తను ప్రేమించిన అమ్మాయితో
హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న
ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్
చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత
జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’గానే విలన్ పై
ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ
ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన
ఓ మనిషిపై..అదీ ఓ పరమ
క్రూరుడి పై ఆ ‘ఈగ’ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం
ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ఈగ’ కథాంశం.
0 comments:
Post a Comment