హైదరాబాద్:
అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు
సమన్లు జారీ చేసింది. మే
28న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మరో 12 మంది వ్యక్తులు, సంస్థలకు
కూడా సమన్లు అందజేయాలని న్యాయస్థానం సీబీఐకి నిర్దేశించింది. సీబీఐ చార్జ్షీట్లో పేర్కొన్న విజయసాయి
రెడ్డి, అరబిందో, హెటిరో డ్రగ్స్, ట్రైడెంట్ ఫార్మా ఇండియా లిమిటెడ్, శ్రీనివాస్ రెడ్డి, నిత్యానంద రెడ్డి, శరతచంద్రారెడ్డి, బీపీ ఆచార్య, వైవీఎల్
ప్రసాద్, జగతి పబ్లికేషన్స్కు
సమన్లు జారీ అయ్యాయి. సీబీఐ
కోర్టులో దాఖలు చేసిన తొలి
చార్జ్షీట్ మే 28న
విచారణకు రానుంది.
వైయస్
జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మొదటి చార్జిషీట్ను మార్చి 31వ
తేదీన కోర్టులో దాఖలు చేసింది. ఈ
చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న
కోర్టు వైయస్ జగన్తో
పాటు మరో 12 మందికి సమన్లు జారీ చేసింది. ఆ
తర్వాత రెండు అనుబంధ చార్జిషీట్లను
సిబిఐ దాఖలు చేసింది. ఈ
మూడు చార్జిషీట్లలోనూ జగన్ను తొలి
నిందితుడిగా వైయస్ జగన్ను,
రెండో నిందితుడిగా జగతి పబ్లికేషన్స్ వైయస్
చైర్మన్ విజయసాయి రెడ్డిని సిబిఐ చేర్చింది.
ఐఎఎస్
అధికారి బిపి ఆచార్యపై ఐపిసి
120బి, 409 సెక్షన్ల కింద అభియోగాలను కోర్టు
విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ అనుమతి లేనందున ఆచార్యపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను
కోర్టు పక్కన పెట్టింది. సమన్లను
అందజేసే బాధ్యతను కోర్టు సిబిఐకి అప్పగించింది. వైయస్ జగన్ ఉప
ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా తిరుగుతున్న
విషయం తెలిసిందే. కోర్టు సమన్ల జారీతో వైయస్
జగన్ ఆస్తుల కేసు మలుపు తిరిగినట్లేనని
భావించాలి. వైయస్ జగన్ ఆస్తుల
కేసులో ఇప్పటి వరకు సిబిఐ విజయసాయిరెడ్డిని
మాత్రమే అరెస్టు చేసింది. ఆయన కూడా ప్రస్తుతం
బెయిల్పై బయటే ఉన్నారు.
జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ సోమవారం కోర్టులో
మూడో చార్జీ షీటును దాఖలు చేసింది. ఏ-1
నిందితునిగా జగన్, ఏ-2 విజయసాయిరెడ్డి,
ఏ-3 జగతి పబ్లికేషన్స్, ఏ-4
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి (ఏఐఎస్), ఏ-5 రాంకీ అధినేత
అయోధ్యరామిరెడ్డిల పేర్లను సిబిఐ అధికారులు చార్జీ
షీటులో చేర్చింది.
మొత్తం
88 పేజీలు, 142 డాక్యుమెంట్లు, 72 మంది సాక్షులతో కూడుకున్న
చార్జీషీటును సిబిఐ అధికారులు సోమవారం
కోర్టులో దాఖలు చేశారు. జగతి
పబ్లికేషన్స్లో రాంకీ ఫార్మాసిటీ
కంపెనీ 20 కోట్ల రూపాయలు పెట్టుబడులు
పెట్టిందని, 350 రూపాయల చొప్పున 55 వేల షేర్లను కొన్నారని
చార్జీ షీటులో సీబీఐ చెప్పింది. ఇందుకు
ప్రతిఫలంగా పోలేపల్లి సెజ్లో 77 ఎకరాలు,
విశాఖ జిల్లా, పరవాడలో రాంకీ ఫార్మా సిటీ
కంపెనీకి 1500 ఎకరాల భూమిని లబ్ది
పొందారని, ఆ సమయంలో ఉడా
ఛైర్మన్గా వెంకట్రామిరెడ్డి ఉన్నట్లు
సీబీఐ చార్జీ షీటులో వివరించింది.







0 comments:
Post a Comment