హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని సుమారు నాలుగు గంటల పాటు సిబిఐ
శుక్రవారం విచారించింది. ఉదయం గం.10.35 నిమిషాలకు
విచారణ ప్రారంభించింది. సిబిఐ జాయింట్ డైరెక్టర్
లక్ష్మీ నారాయణ, సిబిఐ ఎస్పీ వెంకటేష్
ఆయనను విచారించారు. అనంతరం మధ్యాహ్న భోజనం కోసం అరగంట
పాటు సమయం ఇచ్చారు. భోజనం
అనంతరం మళ్లీ విచారించనున్నారు. వైయస్
జగన్ ఇంటి భోజనమే తిన్నారు.
ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇంటి నుండి భోజనం
తీసుకు వచ్చింది.
కాగా
సిబిఐ వైయస్ జగన్ ఆస్తుల
కేసులో జగన్, మోపిదేవి వెంకటరమణ,
నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను శుక్రవారం విచారిస్తోంది. వీరి నలుగురిని వేర్వేరు
నాలుగు గదులలో సిబిఐ అధికారులు విచారిస్తున్నట్లుగా
తెలుస్తోంది. సిబిఐ అధికారులు నలుగురిని
విచారించేందుకు ఓ ప్రశ్నావళి తయారు
చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నలుగురికి వేర్వేరుగా ఒకే ప్రశ్నను వారికి
సంధిస్తూ... వారి సమాధానాలను టాలీ
చేస్తున్నట్లుగా సమాచారం.
జగన్కు చెందిన సాక్షి
మీడియాలోకి వచ్చిన పెట్టుబడులపై వారు ఆరాతీస్తున్నారు. సిబిఐ
జెడి లక్ష్మీ నారాయణే జగన్ను స్వయంగా
ప్రశ్నిస్తున్నారు. అడిగిన ప్రశ్నలకు అనుబంధ ప్రశ్నలు జత చేస్తూ జగన్
నుంచి నిజాలను రాబట్టేందుకు సిబిఐ ప్రయత్నిస్తుండవచ్చని అంటున్నారు.
కాగా
ఉదయం వైయస్ జగన్ సిబిఐ
విచారణ కోసం దిల్ కుషా
అతిథి గృహానికి వచ్చిన విషయం తెలిసిందే. జగన్తో పాటు ఏలూరు
ఎమ్మెల్యే ఆళ్ల నాని, అనకాపల్లి
పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి సిబిఐ
కార్యాలయానికి వచ్చారు. సిబిఐ అధికారులు నేతలను
అందరినీ బయటకు పంపించి జగన్ను విచారణ కోసం
లోనికి తీసుకు వెళ్లారు.







0 comments:
Post a Comment