హైదరాబాద్:
కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు.
ఉప ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ
అభ్యర్థులను కాంగ్రెసు అధిష్టానం ఖరారు చేసినట్లు తెలిసింది.
రాజంపేటకు మేడా మల్లికార్జున రెడ్డి,
రాయచోటికి రాంప్రసాద్ రెడ్డిని ముఖ్యమంత్రి సిఫార్సు చేశారు. అయితే, ఈ ఇద్దరు అభ్యర్థులను
కడప జిల్లాకు చెందిన మంత్రులు వ్యతిరేకించారు. బలిజ, ముస్లిం మైనారిటీలకు
ఆ టికెట్లు ఇస్తే విజయావకాశాలు ఉంటాయని
వారు వాదించారు. దీనిపై పార్టీ అధిష్టానానికి కూడా లేఖలు వెళ్లాయి.
అయితే పట్టు బట్టి కిరణ్
కుమార్ రెడ్డి తాను సిఫార్సు చేసిన
అభ్యర్థులకు అధిష్టానంతో ఆమోద ముద్ర వేయించుకున్నట్లు
తెలుస్తోంది.
కడప జిల్లా మంత్రులు సి.రామచంద్రయ్య, డిఎల్.రవీంద్రారెడ్డి, అహ్మదుల్లానను కాదని ముఖ్యమంత్రి తన
వర్గానికి చెందిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి తన వర్గానికి చెందిన
నాయకులకు టికెట్లు ఇప్పించుకున్నారు. రాజంపేట, రేల్వే కోడూరు, రాయచోటి స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
రైల్వే కోడూరు అభ్యర్థిగా ఎంపికైన ఈశ్వరయ్య కూడా ముఖ్యమంత్రి వర్గానికి
చెందినవారేనని చెబుతున్నారు. దాంతో ముగ్గురు మంత్రులు
కూడా తీవ్ర అసంతృప్తికి గురైనట్లు
చెబుతున్నారు. అందుకే ఉపఎన్నికల్లో జయాపజయాలతో తమకు సంబంధం లేదని
మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి
అన్నట్లు తెలుస్తోంది.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్
అభ్యర్థుల విజయానికి తాను కృషి చేయడం
లేదని స్పష్టం చేశారు.
తిరుపతి,
పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తిరుపతి సీటుపై కన్నేసిన మంత్రి గల్లా అరుణ కుమారి
తన కుమారుడు గల్లా జయదేవ్కు
టిక్కెట్ ఇవ్వక పోవడంతో అసంతృప్తికి
గురైనట్లు చెబుతున్నారు. తన భార్య జ్యోతికి
పరకాల సీటు ఇవ్వకపోవడంపై ప్రభుత్వ
చీఫ్ విప్ బహిరంగంగానే హల్చల్ చేశారు. పైగా,
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన సమ్మారావుకు
ఎలా సీటు ఇస్తారని ఆయన
వర్గం నాయకులు ప్రశ్నించారున.
అభ్యర్థుల
జాబితాను కాంగ్రెసు అధిష్టానం అధికారికంగా ప్రకటించక ముందే అసంతృప్తులు పెల్లుపబుకుతున్నాయి.
ప్రకటించిన తర్వాత ఇంకా రాజుకునే అవకాశాలున్నట్లు
చెబుతున్నారు. మొత్తంగా అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి మాటతో పాటు పిసిసి
అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట
కూడా నెగ్గినట్లు చెబుతున్నారు.
0 comments:
Post a Comment