హైదరాబాద్:
తీన్మార్ సినిమా నిర్మాత
బండ్ల గణేష్పై సినీ
పంపిణీదారుడు సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ఆ సినిమా విషయంలో
నిర్మాత బండ్ల గణేష్ తనను
మోసం చేశాడని, న్యాయం చేయాలని అడిగితే రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పేరు
చెప్పి బెదిరించారని ఆయన ఆరోపించారు. శనివారం
ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తీన్మార్ చిత్రం
విదేశీ హక్కుల కోసం రూ. 2.25 కోట్లు
డబ్బు తీసుకుని కూడా గణేష్ సకాలంలో
ప్రింట్ అందించలేదని ఆయన చెప్పారు. ఇదేమని
అడిగితే తన వెనక బొత్స
ఉన్నారని బెదిరించారని ఆయన అన్నారు
రౌడీల
అండ కూడా తనకు ఉందని
చెప్పాడని ఆయన అన్నారు. ప్రీమియర్
షో జరగకపోవడం వల్ల రూ. 48 లక్షలు
నష్టపోయినట్లు ఆయన చెప్పారు. గణేష్
కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతూ ఎలా సినిమాలు తీస్తున్నారనే
విషయంపై సిఐడి చేత విచారణ
జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
గబ్బర్ సింగ్ సినిమా విషయంలో
కూడా ముందస్తు అధిక ధరలకు టికెట్లు
అమ్ముతూ ప్రేక్షకులను మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని
ఆయన అన్నారు. ఈ ప్రయత్నాన్ని ప్రభుత్వం
అడ్డుకోవాలని ఆయన కోరారు..
నిర్మాత
గణేష్ ప్రింట్లు సకాలంలో అందించకపోవడంపై తాము ఆర్థిక నష్టపోయామని
చెబుతూ సుబ్బారావు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని డిసిపి
జాన్ విక్టర్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఈ విషయంలో రాజీ
కోసం కుదిరిన ఒప్పందం ప్రకారం గణేష్ రూ. 91.5 లక్షలు
ఇవ్వాల్సినా 4 నెలలుగా ఇవ్వడం లేదని ఆయన చెప్పారు.
గణేష్
వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ దృష్టికి
తెచ్చినా తమకు న్యాయం జరగలేదని
సుబ్బారావు చెప్పారని, విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా,
తీన్మార్ సినిమాలో పవన్
కళ్యాణ్ హీరోగా నటించారు. గబ్బర్ సింగ్ సినిమాలోనూ ఆయన
హీరోగా చేశారు. ఇటీవలే గబ్బర్ సింగ్ ఆడియో విడుదలైంది.
0 comments:
Post a Comment