హైదరాబాద్:
వైయస్ జగన్ కేసులో చార్జిషీట్లకు
సంబంధించి కోర్టు మంగళవారం కీలకమైన నిర్ణయం తీసుకుంది. చార్జిషీట్లను వేర్వేరు కేసులుగా పరిగణిస్తూ నిందితులకు సమన్లు జారీ చేసింది. వైయస్
జగన్ ఆస్తుల కేసులో సిబిఐ సమర్పించిన రెండో
చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి
తీసుకుంది. దీంతో ఇప్పటికే జైలులో
ఉన్న వైయస్ జగన్కు
పిటి వారంట్ జారీ చేసింది. విజయసాయి
రెడ్డికి, జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులకు
సమన్లు జారీ చేసింది. వచ్చే
నెల 11వ తేదీన తమ
ముందు హాజరు కావాలని ముగ్గురిని
కోర్టు ఆదేశించింది.
జగతి
పబ్లికేషన్స్లోకి పెట్టుబడులు వచ్చిన
తీరుపై అభియోగాలు మోపుతూ సిబిఐ రెండో చార్జిషీట్ను దాదాపు నెల
రోజుల క్రితం కోర్టుకు సమర్పించింది. జగతి పబ్లికేషన్స్లో
రూ. 1172 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, వీటిలో 34 కోట్లు అక్రమంగా వచ్చాయని సిబిఐ పేర్కొంది. జగతిలోకి
అక్రమ పెట్టుబడులు రాబట్టడంలో వైయస్ జగన్, విజయసాయి
రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని
సిబిఐ ఆరోపించింది.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల
కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) తిరిగి మూడో చార్జిషీట్ను
కోర్టులో దాఖలు చేసింది. మంగళవారం
సిబిఐ ఈ చార్జిషీట్ను
దాఖలు చేసింది. ఈ నెల 7వ
తేదీన సిబిఐ దాఖలు చేసిన
మూడో చార్జిషీట్ను కోర్టు తిరస్కరించింది.
దాంట్లో తప్పులున్నాయని, దర్యాప్తు అధికారి సంతకం కూడా లేదని
అంటూ ఆ చార్జిషీట్ను
కోర్టు తిరస్కరించింది. దీంతో మళ్లీ సిబిఐ
మంగళవారం తప్పులు సరిదిద్ది మూడో చార్జిషీట్ను
కోర్టుకు సమర్పించింది.
ఈ చార్జిషీట్లో సిబిఐ ఆరుగురు
నిందితులను చేర్చించింది. తొలి నిందితుడిగా వైయస్
జగన్ను, రెండో నిందితుడిగా
జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ
సాయిరెడ్డిని, మూడో ముద్దాయిగా వైయస్
జగన్కు చెందిన జగతి
పబ్లికేషన్స్ను చేర్చింది. నాలుగో
నిందితుడిగా రాంకీ సంస్థ చైర్మన్
అయోధ్య రామిరెడ్డిని, ఐదో నిందితుడిగా ఐఎఎస్
అధికారి వెంకట్రామిరెడ్డిని, ఆరో ముద్దాయిగా రాంకీ
సంస్థను చేర్చింది.
వైయస్
రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం సమీపంలో రాంకీ భూములను పొందిందని,
అందుకు ప్రతిఫలంగా వైయస్ జగన్ కంపెనీలో
పది కోట్ల రూపాయల పెట్టుబడి
పెట్టిందని సిబిఐ ఆరోపించింది. మొదటి
చార్జిషీట్కు సంబంధించి వైయస్
జగన్కు కోర్టు వచ్చే
నెల 11వ తేదీ వరకు
జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జగన్ రెండో చార్జిషీట్
విషయంలో 11వ తేదీన కోర్టుకు
హాజరు కావాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment