పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన
‘గబ్బర్ సింగ్’ భారీ కలెక్షన్లతో దూసుకెలుతున్న
సంగతి తెలిసిందే. ‘దమ్ము’ జోరు తగ్గాక ‘గబ్బర్
సింగ్’
బాక్సాఫీసుపై దూకడంతో మార్కెట్లో పోటీ లేకుండా అయి
పోయింది. ఈ నేపథ్యంలో ఆ
చిత్రం జోరును తగ్గించేది రవితేజ ‘దరువు’ మాత్రమే అని మార్కెట్ వర్గాలు
గతంలో విశ్లేషించాయి.
అయితే
తాజాగా ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం...‘దరవు’ చిత్రం ‘గబ్బర్ సింగ్’కు ఏమాత్రం పోటీ
ఇవ్వలేక పోగా, గబ్బర్ సింగ్
ప్రభంజనం ధాటికి తట్టుకోలేక పోతోంది. కారణం ‘దరువు’ చిత్రం తొలి రోజే యావరేజ్
టాక్ తెచ్చుకోవడమే అని అంటున్నారు. కథ
కథనం పాతదే కావడం, రొటీన్
రవితేజ మార్క్ ఎంటర్ టైనర్ కావడంతో
జస్ట్ యావరేజ్గా మిగిలి పోయింది.
దీంతో గబ్బర్ సింగ్ చిత్రం మూడో
వారంలోనూ మంచి కలెక్షన్లు సాధిస్తోంది.
ఈ నెల 25న విడుదలైన
దరువు చిత్రం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే....ఈ చిత్రం తొలి
రోజు రూ. 4.4 కోట్ల వసూళ్లూ సాధించింది.
రెండో రోజైన శనివారం రూ.
3.8 కోట్లు. అయితే తిరిగి ఆదివారం
రోజు పుంజుకుని రూ. 4. 5 కోట్లు సాధించింది. టోటల్ గా తొలి
మూడు రోజులు 12.7 కోట్ల వసూళ్లు సాధించింది.
గబ్బర్ సింగ్ చిత్రం మూడో
వారంలోనూ దరువుతో పోటీ పడుతూ వీకెండ్లో దాదాపుగా 8 కోట్ల
వసూళ్లు సాధించింది.
కాగా...జూన్ 1న బాలయ్య
నటించిన ‘అధినాయకుడు’ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమా వచ్చాక
గబ్బర్ సింగ్, దరువుల కలెక్షన్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో
అనేదానిపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది. బాలయ్యకు
ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆ చిత్రానికి భారీ
ఓపెనింగ్స్ ఖాయం అంటున్నారు.
0 comments:
Post a Comment