రవితేజ,
తాప్సీ కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర
ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై
బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘దరువు’.
సౌండ్ ఆఫ్ మాస్ అనే
ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న
ఈ చిత్రం మొదట ఈ నెల
4 విడుదల చేస్తామని అన్నారు. అయితే దాన్ని ఫోస్ట్
ఫోన్ చేసి ఈ నెల
18న విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసినట్లు నిర్మాత
చెప్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రవితేజకు మాస్లో ఉన్న
ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని
తయారు చేసిన కథ ఇది.
నూటికి నూరు పాళ్లు వినోదంతో
రంగరించి ఈ సినిమా తీసామని
దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.
నిర్మాత
మాట్లాడుతూ ''రవితేజ హుషారైన నటన ఈ చిత్రానికి
ప్రధాన బలం. ఆయన పాత్ర
ఐదు విభిన్నమైన ఛాయల్లో ఉంటుంది. ఈ మాస్ కథకు
యమలోకంతో సంబంధం ఉంది. అదేంటో సినిమా
చూసి తెలుసుకోవలసిందే. విద్యాబాలన్గా బ్రహ్మానందం నటన
నవ్వుల్ని పంచుతుంది. ఇటీవల విడుదల చేసిన
పాటలకు మంచి స్పందన వస్తోంది''అన్నారు.
దర్శకుడు
శివ మాట్లాడుతూ...అతన్ని కలిసి మాట్లాడక్కర్లెద్దు. ఆ చేష్టలు
తలచుకొంటే చాలు... కాలక్షేపం అయిపోతుంది. అంత సరదా మనిషి.
కాస్త తిక్క కూడా ఉందండోయ్.
ఎవరినైనా కొట్టేస్తాడు. దానికి ప్రత్యేక కారణాలేం ఉండవ్. ఫామ్లో ఉన్నాడో
లేదో చూసుకోవడానికి అంతే! ఆ దరువు
కూడా తమషాగానే ఉంటుంది. చంద్రముఖి, కాంచన... సినిమాల్ని కలిపి చూపిస్తాడు. ఇతని
కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే
అన్నారు.
ఇక రవితేజ క్యారెక్టర్ గురించి చెపుతూ...అతను పక్కా మాస్.
మనిషి మాస్క్ వేసుకున్న ట్రాన్స్ఫార్మర్లాగా పూర్తి ఎనర్జీతో
ఉంటాడు. శత్రువులకు అతనంటే బెదురే. అతగాడు దరువేశాడంటే భూగోళం దద్దరిల్లాల్సిందే. ఈ తరహా మనస్తత్వంతోనే
రవితేజ పాత్రను తీర్చిదిద్దాం అన్నారు. అలాగే కొంచెం యాక్షన్కి, ఇంకొంచెం సున్నితమైన
భావోద్వేగాలకూ చోటుంటుంది. ఈ కొలతలతో మరో
సినిమా సిద్ధమైపోతోంది. ఈసారి మాత్రం వినోదాల
సౌండ్ ఎక్కువే. మాస్తో తీన్మార్ ఆడించే కథతో
వస్తున్నారని చెప్పారు.
బ్రహ్మానందం,
సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అవినాష్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ
చిత్రానికి కథ, స్క్రీన్ప్లే:
శివ, ఆదినారాయణ, సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా:
వెట్రివేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి.
0 comments:
Post a Comment