హైదరాబాద్:
బాబ్లీ ప్రాజెక్టు విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
మెతక వైఖరి అవలంభించారని తెలుగుదేశం
పార్టీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ ఆదివారం ఆరోపించారు.
ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీయే అని గుర్తు చేశారు.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం
తెలుగుదేశం పార్టీ తన వంతు సహకారం
అందిస్తుందని చెప్పారు.
కాంగ్రెసు
పార్టీ జలయజ్ఞంను ధనయజ్ఞంగా మార్చేసిందని విమర్శించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ఒప్పందాలపై చర్చకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.60వేల
కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ చుక్క
నీరు వినియోగంలోకి రాలేదన్నారు. పోలవరం పేరిట కాంగ్రెసు నేతలు
కోట్లు కాజేశారన్నారు. ఇప్పటికైనా దీనిని వినియోగంలోకి తీసుకు రావాలని కోరారు.
మరోవైపు
సోమవారం నాటి తెలుగుదేశం పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడు
మాచర్ల పర్యటన వాయిదా పడింది. ఆయన ఉదయం గుంటూరు
జిల్లా పార్టీకి చెందిన కాపు నేతలతో సమావేశమయ్యారు.
పార్టీ అసంతృప్త నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా వారు
కాపులకు పార్టీలో ప్రాధాన్యం ఉందని, మరింత ఇవ్వాలని అధినేతను
కోరారు. ఇందుకు బాబు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
వచ్చే
సాధారణ ఎన్నికలలో గుంటూరు జిల్లాకు రెండు ఎమ్మెల్యే, ఒక
ఎమ్మెల్సీలు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు చెప్పారు. పార్టీలో కాపులకు ప్రాధాన్యం ఉందని చెప్పారు. ప్రాధాన్యత
లేదనటం సరికాదన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీలోనే ఉంటారని, ఆయన పార్టీకి రాజీనామా
చేసే ప్రసక్తి లేదని చెప్పారు. ఆయన
విషయమై చర్చకు రాలేదన్నారు.
కాగా
చంద్రబాబు నాయుడు ఈ నెల ఎనిమిదవ
తేదిన మాచర్లలో, తొమ్మిదో తేదిన ప్రత్తిపాడు నియోజకవర్గాలలో
ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆయన తిరుపతిలో ఉప
ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆదివారం ఉదయం హైదరాబాదుకు చేరుకున్నారు.







0 comments:
Post a Comment