విజయవాడ/తిరుపతి: సినిమా మాఫియాలో కూడా ప్రదేశ్ కాంగ్రెసు
కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి
బొత్స సత్యనారాయణ హస్తం ఉందని తెలుగుదేశం
పార్టీ నేత దేవినేని ఉమా
మహేశ్వర రావు ఆదివారం ఆరోపించారు.
ఆయన కృష్ణా జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. పవర్ స్టార్ పవన్
కల్యాణ్ హీరోగా వచ్చిన తీన్మార్ చిత్రం
నిర్మాత గణేష్తో బొత్స
సత్యనారాయణకు లింకేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనిపై
ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధాలను బయట పెట్టాలన్నారు. తిరుమల
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కిరీటం నుండి
రాలిన వజ్రాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం
చేశారు. వాటిని వెంటనే బయట పెట్టాలన్నారు.
కాగా
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
తిరుపతి శివార్లలోని శెట్టిపల్లిలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ మనుగడ సాధించలేదని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటు వేసి సమస్యలు
కొని తెచ్చుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నేత కరుణాకర్ రెడ్డి
హయాంలో తిరుమల శ్రీవారి ఆభరణాలు, వజ్రాలు అదృశ్యమై ఆయనకు వందల కోట్ల
ఆస్తులు సమకూర్చాయని ఆరోపించారు. కాగా ఆ తర్వాత
చంద్రబాబు తిరుపతిలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని హైదరాబాద్ బయలుదేరారు.
చంద్రబాబు
తన నివాసంలో గుంటూరు జిల్లా పార్టీ కాపు నేతలు ఆయనతో
భేటీ కానున్నారు. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యవహారంపై వారు చర్చించనున్నారు. ఇదే
సమయంలో పార్టీలో కాపులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని
వారు బాబును కోరే అవకాశముంది.
0 comments:
Post a Comment