వన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్సింగ్' ఎల్లుండి గ్రాండ్ గా విడుదల అవుతోంది.
నిన్న సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డ్యూరేషన్
రెండు గంటల 29 నిముషాలు. ఇన్ సైడ్ రిపోర్టుల
ప్రకారం నిర్మాత బండ్ల గణేష్ ..సెన్సార్
రిపోర్టు విని చాలా హ్యాపీగా
ఉన్నారు. రికార్డు నెంబర్లు ధియేటర్లలతో గబ్బర్ సింగ్ మే 11న
ప్రపంచ వ్యాప్తంగ పవన్ అభిమానులను అలరించనుంది.
బాలీవుడ్
సూపర్ హిట్ దబాంగ్ రీమేక్
గా రూపొందిన ఈ చిత్రం ఇప్పటివరకూ
అందిన సమచారం ప్రకారం మన స్టేట్ లో885
పై చిలుకు ధియోటర్స్ లో రిలీజవుతోంది. మిగతా
ధియోటర్స్ ఖరారు కావాల్సి ఉంది.
కేవలం మన రాష్ట్రంలోనే ఇన్ని
ధియోటర్స్ విడుల అవటం రికార్డే
అంటున్నారు.
ఇక గబ్బర్ సింగ్ చిత్రం ఈ
మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏ
చిత్రానికి రానంత క్రేజ్ సంపాదించుకుంది.
హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందిన
ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. పంచ్
డైలాగులు,మాస్ కి కిక్కిచ్చే
పాటలు ఈ చిత్రం ప్రత్యేకతలు
అంటున్నారు. అలాగే ఫ్యాన్స్ ని
ఊపేసే పవన్ మ్యానరిజమ్స్ సినిమాకు
హైలెట్స్ అవుతాయంటున్నారు.
'గబ్బర్సింగ్' క్లైమాక్స్ లో వచ్చే డైలాగులు,సీన్ చాలా ఎమోషనల్
గా కట్టిపడేస్తాయని చెప్తున్నారు. సల్మాన్ ఖాన్ దబాంగ్ కి
రీమేక్ గా రూపొందుతున్న ఈ
చిత్రం పవన్ బాడీ లాంగ్వేజి
కి తగినట్లుగా చాలా మార్చారు. ముఖ్యంగా
ఇక్కడ నేటివిటీకి తగినట్లుగా సెంటిమెంట్ ని బాగా పండించినట్లు
చెప్పుకుంటున్నారు. అలాగే హరీష్ శంకర్
రాసిన పంచ్ డైలాగులు సైతం
సినిమాకు ప్రాణంగా నిలుస్తాయి అంటున్నారు.
పరమేశ్వర
ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ
భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్,
కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్,
ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్,
మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన
ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం:
దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.
0 comments:
Post a Comment