గ్రీన్
టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, అనేక
ప్రయోజనాలున్నాయని చెపుతారు. గ్రీన్ టీ బరువు తగ్గిస్తుంది,
చర్మం మెరుపు పెరుగుతుంది, జుట్టు రాలుడు తగ్గుతుంది. శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. అయినప్పటికి ఏది అతిగా తాగినా
ఆరోగ్యానికి హానికరమే. మరి గ్రీన్ టీ
అధికంగా తాగితే వచ్చే దుష్ఫలితాలు పరిశీలించండి.
గ్రీన్ టీ మలబద్ధకం ఏర్పరుస్తుంది.
లేదా డయోరియా కలిగిస్తుంది, వాంతులు, కళ్ళు తిరగడం, తలనొప్పి
వంటివి కూడా వస్తాయి. గ్రీన్
టీ లో కేఫైన్ వుంటుంది.
ఇది నిద్ర రాకుండా చేస్తుంది.
మరి గ్రీన్ టీ ఎలా తాగితే
ప్రయోజనకారి? అనేది చదవండి.
తాజాగా
తీసుకోండి - తయారు చేసిన తర్వాత
గంటకు మించి నిలువ వుంచకండి.
వేడి ఎక్కువగా వుంటే కేన్సర్ వస్తుంది.
కనుక అధిక వేడికల గ్రీన్
టీ తాగకండి. ఎక్కువసమయం నిలువ వుంచితే, దానిలోని
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పోతాయి.
అధిక సమయం నిల్వ వుండటంతో
హానికలిగించే బాక్టీరియా దానిలో చేరే ప్రమాదం వుంది.
కనుక ఎల్లపుడు తాజాగా తాగండి.
భోజనానికి
1 గంట ముందర - డైటింగ్ చేసేవారు గ్రీన్ టీ ని భోజనానికి
ముందర తాగుతారు. అది ఆకలిని చాలాసేపు
నియంత్రిస్తుంది. కనుక భోజనానికి 1 గంట
ముందర తీసుకుంటే, అధికంగా తినరు. దీనిలో వుండే కేఫైన్ ఆకలి
చంపుతుంది. సాయంకాలం వేళ గ్రీన్ టీ
తీసుకునేవారు దానితోపాటు కొవ్వు తక్కువకల బిస్కట్లు కూడా తినవచ్చు. ఖాళీ
కడుపుతో ఉదయంవేళ గ్రీన్ టీ తాగకండి.
గ్రీన్
టీ మందులతో తీసుకోరాదు - ఏదేని మెడిసిన్ వేసి
గ్రీన్ టీ తాగకండి. దానివలన
సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా వుంటాయి. మెడిసిన్ ఎపుడూ నీటితోనే తీసుకోవాలి
లేదా వైద్యలు చెప్పిన విధంగా తీసుకోవాలి.
స్ట్రాంగ్
గా తాగకండి - గ్రీన్ టీ స్ట్రాంగ్ గా
తాగవద్దు. దీనిలో కేఫైన్ మరియు పాలీఫెనాల్స్ వుంటాయి.
ఇవి శరీర ఆరోగ్యంపై సైడ్
ఎఫెక్టులు కలిగిస్తాయి. స్ట్రాంగ్ గా తాగితే అజీర్ణం,
నిద్రలేమి, గుండె ఆగి ఆగి
కొట్టుకోవడం కలిగిస్తుంది.
రెండు
కప్పులు మాత్రమే - అధికంగా తాగితే ఏదైనా హాని కలిగిస్తుందని
తెలుసుకున్నారు. కనుక దీనిలో వుండే
కేఫైన్ కారణంగా ప్రతిరోజూ రెండు లేదా మూడు
కప్పులకు మించి గ్రీన్ టీ
తాగకండి.
ఇవి గ్రీన్ టీ సరిగా తాగకపోయినా
లేదా అధికంగా తగినా కలిగే నష్టాలు.
ఇది బరువు తగ్గేందుకు సహకరించే
పానీయం కనుక తగినంత మోతాదులో
ఎప్పటికపుడు తాజాగా తయారు చేసుకుంటూ తాగితేనే
శరీరానికి ఆరోగ్యం.
0 comments:
Post a Comment