మెదక్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర వల్లనే పోలీసులు
తప్పుడు కేసు పెట్టిన తనను
అరెస్టు చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కెఏ
పాల్ శనివారం ఆరోపించారు. తన అన్నయ్య డేవిడ్
రాజు హత్య కేసుతో తనకు
ఎలాంటి సంబంధం లేదన్నారు. శనివారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో
కోర్టులో పోలీసులు ఆయనను హాజరుపరిచిన అనంతరం
విలేకరులతో మాట్లాడారు.
హత్యతో
తనకు సంబంధం ఉన్నట్టు రుజువు చేస్తే కోటి రూపాయలు ఇస్తానని
ప్రకటించారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లో తమ
పార్టీ అభ్యర్థులకు దళిత ఓట్లన్నీ పడతాయన్న
భయంతోనే జగన్ ఇలాంటి కుట్రలు
చేస్తున్నారని, తనకు ప్రధాన శత్రువు
ఆయనొక్కడే అని ఆరోపించారు. ఆయనవద్ద
ఉన్నట్లు తనకు లక్షల కోట్ల
డబ్బుగానీ, సొంత మీడియాగానీ లేవన్నారు.
కాగా, ఈ హత్య కేసులో
పోలీసులు అసలు దోషులను వదిలేసి,
తనను ఇరికించారని నిందితుడైన (ఎ8) సాల్మన్రాజ్
(డేవిడ్ రాజ్ తనయుడు) పేర్కొన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో
తన న్యాయవాది వెంకటేశ్ నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
అప్పటి ఎస్పీ, డిఎస్పీలు పాల్ ప్రలోభాలకు తలొగ్గి
తనను ముద్దాయిగా చేర్చారని ఆరోపించారు. ఒంగోలు పోలీసులకు రూ.కోటి ఆశచూపిన
తరహాలోనే జిల్లా పోలీసులకూ పాల్ సొమ్ము ముట్టజెప్పి
ఉండవచ్చన్నారు. ఇక తన తల్లి
ఎస్తర్ రాణి 2010 అక్టోబర్ 19న సిఎం రోశయ్యకు
ఫిర్యాదు చేసినా పాల్పై విచారణ
చేయకపోవడం దారుణమన్నారు.
ఇప్పుడు
దైవకృప వల్ల పాల్ అరాచకాలు
బయటపడ్డాయని, ఆయన బావమరిది ఏసుపాదం
పైనా సిబిసిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు షాద్నగర్ రూరల్
సిఐ షాకీర్ హుస్సేన్ను సస్పెండ్ చేస్తూ
హైదరాబాద్ రేంజ్ డిఐజి నాగిరెడ్డి
శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
డేవిడ్రాజ్ హత్యోదంతంపై అప్పట్లో
అడ్డాకుల స్టేషన్లో కేసు నమోదు
చేశారు. అయితే కొత్తకోట సిఐ
పరిధిలో ఉన్న ఈ కేసు
దర్యాప్తు బాధ్యతను అప్పటి జడ్చర్ల సిఐ షాకీర్ హుస్సేన్‌కు అప్పగించారు. ఉన్నతాధికారుల
జోక్యంతో దర్యాప్తు సవ్యంగా సాగించలేదని, పాల్ ప్రమేయంపై నిందితుల
వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం డిఐజి నాగిరెడ్డి, ఎస్పీ
లక్ష్మీ రెడ్డి అడ్డాకుల స్టేషన్లో హత్యకేసు ఫైల్ను పరిశీలించారు. అనంతరం
సిఐని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
0 comments:
Post a Comment