హైదరాబాద్:
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో సినీ నటి జయలలిత
సోమవారం చేరారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె వైయస్సార్ కాంగ్రెసు
పార్టీలో చేరారు. పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి
జయలలితకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జయలలిత మాట్లాడారు.
తెలుగుదనానికి
ప్రతిబింబంగా నిలిచే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
స్ఫూర్తిగా తాను రాజకీయాలలో చేరుతున్నట్లు
జయలలిత ఈ సందర్భంగా ప్రకటించారు.
ప్రముఖ సినీ నటుడు గిరిబాబు
పార్టీలో చేరడం తనకు ప్రేరణగా
నిలిచిందని ఆమె చెప్పారు. తాను
పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తానని
చెప్పారు.
కాగా
ఇటీవల సినీ నటుడు గిరి
బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
ఇప్పటికే నటి రోజు పార్టీలో
కీలక నేతగా ఉన్నారు. తాజాగా
గిరిబాబు, జయలలిత చేరడంతో పార్టీ మరింత పటిష్టం అవుతుందని
కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా మరోవైపు సీమాంధ్ర జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసులోకి ఇతర పార్టీల నుండి
నేతలు పలువురు జాయిన్ అవుతున్న విషయం తెలిసిందే.
విజయనగరం
జిల్లాలో గద్దె బాబూరావు తెలుగుదేశం
పార్టీకి రాజీనామా చేసి వైయస్ జగన్మోహన్
రెడ్డి సమక్షంలో ఇటీవల కాంగ్రెసు పార్టీలో
చేరారు. అదే జిల్లాకు చెందిన
మరో నేత కూడా టిడిపికి
రాజీనామా చేశారు. ఆయన కూడా జగన్
పార్టీలో చేరే అవకాశముంది. కాగా
జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో
బిజీగా ఉన్నారు.







0 comments:
Post a Comment