యంగ్
టైగర్ జూ ఎన్టీఆర్, క్రేజీ
దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో ‘బాద్
షా’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మే
20న జూ ఎన్టీఆర్ పుట్టిన
రోజును పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్
లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మరింత స్లిమ్‌గా
ఎనర్జిటిక్ లుక్‌తో కనిపిస్తూ
అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.
బాద్
షా చిత్రం తొలి షెడ్యూల్ త్వరలో
ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ యూరఫ్‌లో ప్లాన్ చేశారు.
ఈ మేరకు యూనిట్ సభ్యులంతా
అక్కడి వెళ్లనున్నారు. రెండు నెలల పాటు
అక్కడ షూటింగ్ జరుగనుంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న
‘బాద్షా’ సినిమాకు శ్రీనువైట్ల దర్శకుడు. కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్
సరసన హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ... ‘దూకుడు’ లాంటి
సూపర్‌హిట్ తర్వాత చేస్తున్న
చిత్రమిది. ఎన్టీఆర్ ఇమేజ్‌కు ఏ
మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.
ఎన్టీఆర్ చిత్రమంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆ
అంశాలన్నీ ఇందులో వుంటాయి. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వచ్చింది.
యాక్షన్‌తో పాటు ఇందులో
ఓ అందమైన ప్రేమకథ ఉంటుందని అన్నారు.
ఈచిత్ర
షూటింగులో భాగంగా ఇటలీ, నేపాల్‌లలో
భారీ చేజింగ్ సీన్లు చిత్రీకరించబోతున్నారు. ఇందుకోసం హాలీవుడ్ చిత్రాలు ‘టాన్స్ ఫార్మర్స్’,
‘హిట్ మ్యాన్’ లాంటి చిత్రాలకు పని
చేసిన టెక్నీషియన్స్‌ను తీసుకుంటున్నారు. ఈ
సీన్లలో భారీగా విజువల్ ఎఫెక్ట్స్ జోడిస్తున్నారు.
0 comments:
Post a Comment