హైదరాబాద్:
కంటతడి పెడితే ఓట్లు రాలే పరిస్థితి
ఉంటే తానూ ఇంటింటికి తిరిగి
ఏడుస్తానని తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి, ప్రముఖ సినీ నటి కవిత
బుధవారం అన్నారు. అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటే రోడ్డెక్కి నటించాలా అని పులివెందుల శాసనసభ్యురాలు
వైయస్ విజయమ్మను ఉద్దేశించి అన్నారు.
ఆమె గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో
పాల్గొన్నారు. వైయస్ జగన్ కుటుంబానికి
నటనలో ఆస్కార్ అవార్డు వస్తుందని ఎద్దేవా చేశారు. కంటతడి పెడితే సానుభూతితో ఓట్లు రాలుతాయనుకుంటే పొరపాటు
అన్నారు. వైయస్ జగన్ ప్రపంచంలోనే
రెండో అతి పెద్ద ఆర్థిక
నేరస్థుడని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు
అభివర్ణించారు.
అంతులేని
అవినీతిపరులైన ఒకప్పటి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అధ్యక్షులు సుహార్తో, మార్కోస్ల స్థానాలను ఇప్పుడు
మన దేశంలో కేంద్ర మాజీ మంత్రి రాజా,
జగన్ దక్కించుకున్నారని ఆయన విశాఖలో ఎద్దేవా
చేశారు. కొడుకును జైల్లో పెడితే తల్లి విజయలక్ష్మి ధర్నాకు
దిగడం, ఎన్నికల ప్రచారం నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు.
జగన్
జైలుకెళితే విజయలక్ష్మికి పొంగుకొచ్చిన వాత్సల్యం అధికారులు, మంత్రి అరెస్టయినప్పుడు కనిపించలేదేమని మరో నేత ఎర్రన్నాయుడు
విమర్శించారు. కొడుకు జైలుపాలైతే హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా
ఎన్నికల ప్రచారానికి రావడాన్ని ఆయన ఆక్షేపించారు. అధికార
కాంక్ష తప్ప జగన్కు,
ఆయన తల్లికి మరో ఆలోచన లేదన్నారు.
0 comments:
Post a Comment