వాస్తవానికి
కంపెనీ ఇటీవల విడుదల చేసిన
కొత్త స్విఫ్ట్ డిజైన్‌ను స్విఫ్ట్ స్పోర్ట్ను ఆధారంగా చేసుకొని
రూపొందించటం జరిగింది. ఈ స్విఫ్ట్ స్పోర్ట్లో పెద్ద ఫాగ్
ల్యాంప్స్, శక్తివంతమైన హెడ్ల్యాంప్స్, మెటాలిక్
గ్రే కోటింగ్, తక్కువ బరువు కలిగిన పెద్ద
17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సరికొత్త గ్రిల్, ఆకర్షనీయమైన ఏరోడైనమిక్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లు
ఉన్నాయి.
అలాగే
ఇందులో స్పోర్టీ సీట్స్, ఫైవ్-డయల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్తో పాటుగా మరెన్నో
అత్యాధునిక మరియు అదనపు ఫీచర్లను
జోడించారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే.. ఇంజన్
పెర్ఫామెన్స్. కొత్త స్విఫ్ట్ స్పోర్ట్లో ఉపయోగించిన 1.6 లీటర్
డిఓహెచ్సి ఇంజన్ 134 బిహెచ్పిల శక్తిని విడుదల
చేస్తుంది. అంతేకాకుండా ఇది తక్కువ కర్భన
వ్యర్థాలు విడుదల చేస్తుంది. ఏదేమైనప్పటికీ, ఈ కొత్త స్విఫ్ట్
స్పోర్ట్ మార్కెట్లోకి వస్తే.. ఇక మారుతికి తిరుగు
ఉండదని చెప్పవచ్చు.
0 comments:
Post a Comment