కింగ్
నాగార్జున హీరోగా కామాక్షి మూవీస్ పతాకంపై అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్ వంటి సూపర్
హిట్ చిత్రాలు నిర్మించిన అగ్ర నిర్మాత డి.
శివప్రసాద్ రెడ్డి కింగ్ నాగార్జునతో మరో
కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రొడక్షన్ నెం.15గా దశరథ్
దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్
ఈరోజు(మే 5)న హైదరాబాద్
లోని సంస్థ కార్యాలయంలో లాంఛనంగా
ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ క్లాప్
నివ్వగా, హిట్ చిత్రాల నిర్మాత
దిల్ రాజు కెమెరా స్విచ్చాన్
చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి
మాట్లాడుతూ ‘ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 15 నుంచి జరుగుతుంది, యు.ఎస్ లో 40 రోజుల
భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం. నాగార్జున ఇమేజ్కి తగిన
విధంగా డైరెక్టర్ దశరథ్ ఈ సబ్జెక్టుని
అద్భుతంగా రూపొందించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్
టైనర్గా రూపొందుతున్న ఈచిత్రాన్ని
డిసెంబర్లో గానీ, జనవరిలోగానీ రిలీజ్
చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం’
అన్నారు.
దర్శకుడు
దశరత్ హాట్లాడుతూ..‘అమెరికాలోనే పుట్టి పెరిగిన హీరో ఎన్ఆర్ఐగా ఫస్ట్
టైమ్ ఇండియా వస్తారు. అతని అనుభవాలతో ఈ
కథ రూపొందించడం జరిగింది. శివప్రసాద్ రెడ్డిగారితో నాకు ఎప్పటి నుంచో
పరిచయం ఉంది. ఈ బేనర్లో
సినిమా చెయ్యాలన్న కోరిక నెరవేరినందుకు ఆనందంగా
ఉంది. నాగార్జునగారు చేసిన సంతోషం, మన్మథుడు
తరహాలో ఉండే మంచి ఫ్యామిలీ
ఎంటర్ టైనర్ ఇది. సంతోషం
తర్వాత నాగార్జునగారితో మళ్లీ ఈ సినిమా
చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాలో నాగార్జున చాలా కొత్తగా ఉంటారు.
అలాగే కథ కూడా చాలా
ఇంట్రస్టు గా ఉంటుంది’ అన్నారు.
నాగార్జున,
నయనతార జంటగా నటిస్తున్న ఈచిత్రానికి
ఫోటోగ్రఫీ : అనిల్ బండారి, సంగీతం
: థమన్, ఆర్ట్ : ఎస్. రవీందర్, ఎడిటింగ్
: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్ : కె. సదాశివరావు, స్క్రీన్
ప్లే : హరి కృష్ణ, అడిషనల్
స్క్రీన్ ప్లే : ఎం.ఎస్.ఆర్
: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వివేక్, కో ప్రొడ్యూసర్ : డి.
విశ్వచందన్ రెడ్డి, నిర్మాత : డి. శివప్రసాద్ రెడ్డి,
కథ-దర్శకత్వం : దశరథ్
0 comments:
Post a Comment