ఇష్క్
తో చాలా గ్యాప్ తర్వాత
హిట్ కొట్టి ఊపిరిపీల్చుకున్న హీరో నితిన్. అతను
ఇప్పుడు తాను ఆచి తూచి
అడుగులు వేస్తున్నానని చెప్తున్నాడు. తాజాగా వీడు తేడా దర్శకుడు
బి. చిన్నికృష్ణతో సినిమా కమిటయ్యాడని సమాచారం. నిఖిల్ తో వీడు తేడా
తీసి యావరేజ్ చేసిన బి. చిన్నికృష్ణతో
సునీల్ ఆ మద్యన చిత్రం
చేస్తానని మాట ఇచ్చాడు కానీ
వర్కవుట్ కాలేదు. దాంతో నితిన్ ని
సంప్రదించి కథ చెప్పి ఓకే
చేయించుకున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్
గా ఈ చిత్రం ఉండబోతుందని
సమాచారం. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇక నిఖిల్ తో మొదట ఈ
రోజుల్లో దర్శకుడు మారుతి కాంబినేషన్ లో బెల్లంకొండ సురేష్
సినిమా చేస్తారని టాక్ వచ్చింది. ఆ
చిత్రానికి బేవార్స్ అనే టైటిల్ సైతం
పెట్టారని చెప్పుకున్నారు. అయితే నితిన్ కి
ఆ కథ నచ్చకపోవటంతో ఇప్పుడు
చిన్నికృష్ణతో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. చిన్నికృష్ణ వినాయిక్ శిష్యుడు. నటుగానూ కొత్త బంగారు లోకం
చిత్రంలో చేసాడు. నిఖిల్ తో చేసిన వీడు
తేడా చిత్రం మొదట డివైడ్ టాక్
తెచ్చుకున్నా క్రమేణా డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బు తెచ్చిపెట్టి
ఓకే అనిపించుకుంది.
ఇక నితిన్ తన కొత్త చిత్రాల
గురించి మాట్లాడు...ఇకపై నేను చాలా
క్లారిటీతో ఉన్నాను. కథ నచ్చి విషయం
ఉంటేనే అంగీకరిస్తాను. రెండు చిత్రాలకు కమిట్
అయ్యాను. వాటిల్లో ఒకటి బెల్లంకొండ సురేష్ది. ఓవర్సీస్లో ‘ఇష్క్’ కలెక్షన్లలో ద్వితీయస్థానం దక్కించుకోవడం చాలా హ్యాపీగా ఉంది.
తొలి చిత్రంతోనే పీక్ స్టేజ్ ఆనందం
అనుభవించాను. ఈ పదేళ్లలో ఫ్లాపులు
కూడా చూశాను. అన్నింటికీ తట్టుకుని విజయం కోసం ఎదురుచూస్తున్న
సమయంలో ‘ఇష్క్’ సక్సెస్ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
అయితే ఈ విజయాన్ని నేను
ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నా టార్గెట్ అంతా
నా నెక్ట్స్ సినిమా హిట్ కొట్టాలి అనేదే
లక్ష్యంగా పెట్టుకున్నాను.
ఇకపై
కథ కాన్ఫిడెంట్గా నచ్చితేనే సినిమాకు
కమిట్ అవుతాను. ‘ఇష్క్’ బాలీవుడ్‌తోపాటు, తమిళ, కన్నడ భాషల్లో
రీమేక్ రైట్స్ కోసం అడుగుతున్నారు. మల్టీస్టార్
చిత్రాలలో నటించేందుకు అభ్యంతరం లేదు. వచ్చే సంవత్సరం
అటువంటి తరహా చిత్రం ఒకటి
ఉంటుంది. నాన్నగారి సూచనలు, సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.‘జయం’ చిత్రం నటుడిగా నాకు జన్మనిస్తే ‘ ఇష్క్’ పునర్జన్మనిచ్చింది.
ఇక నటుడిగా నా నుంచి ప్రేక్షకులు
ఎటువంటి పాత్రలు కోరుకుంటున్నారో క్లియర్గా అర్థం అయింది.
అలాగని గతంలో నేను చేసినవి
మంచి చిత్రాలు కావని కాదు. ఒక్కోసారి
సినిమా బాగున్నా రాంగ్ టైంలో రిలీజ్ చేయడం
లాంటి కారణాలతో కొన్ని చిత్రాలు ఆడివుండకపోవచ్చు. నా వరకు నేను
జడ్జి చేసిన చిత్రాలలో ‘శ్రీఆంజనేయం’, ‘టక్కరి’ చిత్రాలు
ఆడకపోవడం బ్యాడ్లక్. లక్కుగా పెద్ద
దర్శకులందరితోనూ చేశాను. మొహమాటాల వలన కొన్ని చిత్రాలలో
నటించాను అన్నారు.
0 comments:
Post a Comment