అదృష్టమో..?
హార్ట్ వర్కో..? తెలియదు కానీ...గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్
శంకర్కు దిల్ రాజు
గొప్ప సాయం చేశాడు. దీంతో
ఎంతో పొంగి పోతున్నాడు ఈ
యంగ్ డైరెక్టర్. అసలు గబ్బర్ సింగ్
చిత్రానికి, దిల్ రాజుకు సంబంధమే
లేదు. కానీ ఈ చిత్రం
పోస్టు ప్రొడక్షన్ వర్కులో దిల్ రాజు చాలా
సాయ పడ్డాడట.
ఇందుక
కారణం పవన్ కళ్యాణే అంటున్నారు.
నిర్మాత దిల్ రాజుకు పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా
ఫోన్ చేసి ప్రొస్టు ప్రొడక్షన్
పనుల్లో సహకారం అందించాలని కోరాడట. పవర్ స్టార్ అంతటి
వ్యక్తి అడగటంతో కాదనకుండా ఓకే చెప్పేశాడు దిల్
రాజు. పోస్టు ప్రొడక్షన్ పనులు దగ్గరుండి పర్యవేక్షించాడు.
ఓ వైపు సినిమాల మీద
సినిమాలు నిర్మిస్తూ...మరో మరో వైపు
వరుసగా పెద్ద సినిమాలను డిస్ట్రిబ్రూట్
చేస్తూ బిజీగా ఉండే దిల్ రాజు
పవన్ స్టార్ కోసం ఇలా చేయడానికి
ఓ కారణం ఉంది. త్వరలో
పవన్ కళ్యాణ్ దిల్ రాజు బ్యానర్లో
ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో పవర్
స్టార్ను ఇంప్రెస్ చేయడానికే
దిల్ రాజు గబ్బర్ సింగ్
పోస్టు ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడని అంటున్నారు.
గబ్బర్ సింగ్ చిత్రం డిస్ట్రిబ్యూటర్లలో
దిల్ రాజు కూడా ఒకరు.
పరమేశ్వర
ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ
భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్,
కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్,
ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్,
మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన
ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం:
దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.







0 comments:
Post a Comment