బాలయ్య
నటించిన ‘అధినాయకుడు’ చిత్రం సంక్రాంతి నుంచి వాయిదాల మీద
వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూన్
1న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక
ఇబ్బందుల వల్లనే ఈచిత్రం విడుదల ఇంత ఆలస్యం అవుతూ
వచ్చింది. ఎట్టకేలకు అధినాయకుడు కష్టాలు తీరడంపై ఆనందం వ్యక్తం చేస్తూ
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.
‘అధినాయకుడు
చిత్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడి
విడుదలవుతుండటం మంచి వార్త. ఒక
పెద్ద చిత్రం ఎక్కువ కాలం విడుదల కాకుండా
ఉండటం పరిశ్రమకు మంచి కాదు. ఎంతో
మందిపై ప్రభావం పడుతుంది. ఏది ఏమైతేనేం అన్ని
సమస్యలు పరిష్కారం అయ్యాయి. అధినాయకుడు చిత్రానికి పని చేసిన అందరికీ
బెస్టాఫ్లక్’ అంటూ ట్వీట్ చేశారు
రాజమౌళి.
అధినాయకుడు
సినిమా విడుదలవ్వడంపై రాజమౌళి ఇంత సంతోష పడటానికి
అసలు కారణం వేరే ఉంది.
అధినాయకుడు లాంటి పెద్ద సినిమా
త్వరగా విడుదలైతే...త్వరలో విడుదలకానున్న తన ‘ఈగ’ చిత్రానికి కాంపిటీటర్ తగ్గుతాడు. అదన్నమాట అసలు విషయం!
అధినాయకుడు
చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించారు.
ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మాత. లక్ష్మి
రాయ్, సలోని హీరోయిన్లుగా నటించారు.
బాలయ్య తొలి సారిగా ఈచిత్రంలో
త్రిపాత్రాభినయం చేస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. కోట శ్రీనివాస రావు,
బ్రహ్మానందం, చరణ్ రాజ్, ఎమ్మెస్
నారాయణ, వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు ఇతర
పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్:
కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్
0 comments:
Post a Comment